Akhil’s Agent: అయ్యగారి మూవీ ఓటీటీలో రావడం కూడా కష్టమే..!

Akhil's Agent: అయ్యగారి మూవీ ఓటీటీలో రావడం కూడా కష్టమే..!

అక్కినేని అఖిల్(Akhil Akkineni).. ఎందుకోగానీ 13 ఏళ్లవుతున్నా ఈ యంగ్ హీరోకి సక్సెస్ అనేది తగల్లేదు. రీసెంట్‌గా విడుదలైన ఏజెంట్ మూవీపై అయ్యగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం శూన్యం. ఒకసారి ఫ్లాప్ హీరో ముద్ర పడిన తర్వాత ప్రేక్షకులు తిరిగి రిసీవ్ చేసుకోవడం కష్టం. అలాంటిది కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సక్సెస్ కాకుంటు ఇక ఆ హీరో సినిమాను చూసేందుకు ఎవరు సాహసం చేస్తారు? అందుకేనేమో అయ్యగారు ఏజెంట్(Agent Movie) కోసం ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదు. ఇక సినిమా ఎలాగూ పోయింది కనీసం ఓటీటీలో అయినా సందడి చేస్తుందేమో అంటే అదీ లేదు.

Akhil's Agent: అయ్యగారి మూవీ ఓటీటీలో రావడం కూడా కష్టమే..!

ఏజెంట్ రైట్స్ తీసుకున్న డిజిటల్ సంస్థ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కూడా సాహసించడం లేదు. సోనీ లైవ్ ఓటీటీ సంస్థ ఏజెంట్ మూవీ రైట్స్‌ను సినిమా రిలీజ్ కావడానికి ముందే కొనేసింది. కానీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక ఈ మూవీ డిజాస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో ఓటీటీలో వేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుందా? అనేది సందేహంగా మారింది.

అందుకే సోనీ లైవ్ కూడా ఏజెంట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తోందట. అసలు వేస్తారా? లేదా? అనేది కూడా అనుమానమే. అంతేకాదు.. వీలైతే నిర్మాతతో డీల్ క్యాన్సల్ చేసుకునేందుకు కూడా సోనీ లైవ్ సంస్థ చూస్తోందట.

Google News