Mahesh Babu: తమన్‌పై పీకల దాకా కోపం పెంచుకున్న మహేష్.. కారణమేంటంటే..

Mahesh Babu: తమన్‌పై పీకల దాకా కోపం పెంచుకున్న మహేష్.. కారణమేంటంటే..

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌(Thaman)పై సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. దీనికి కారణం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో తమన్ పనితీరు బాగుందని.. ఈ క్రమంలోనే మంచి పాటలు అందించారని.. అయితే బ్యాడ్రౌండ్ స్కోర్ సరిగా రాలేదని మహేష్ అభిప్రాయ పడుతున్నారట.

ఈ క్రమంలోనే తమన్‌కి చాలా బద్దకమని.. ఎప్పుడూ క్రికెట్ ఆడటం.. సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేయడం తప్ప మ్యూజిక్ పని మాత్రం త్వరగా పూర్తి చేయడని సర్కారు వారి పాట మూవీ తర్వాత మహేష్ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారట. దీంతో తమన్‌పై మహేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడట.

Mahesh Babu: తమన్‌పై పీకల దాకా కోపం పెంచుకున్న మహేష్.. కారణమేంటంటే..

ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ చేస్తున్న మూవీ గుంటూరు కారంకి మ్యూజిక్ తమన్ చేత చేయించాలని మేకర్స్ భావించడం.. అనుకున్న తడవుగా ఆయనకు పనిని అప్పగించడం చకచకా జరిగిపోయాయట. అసలే తమన్ అంటే మండి పడుతున్న మహేష్ ఈ సినిమాకు తమన్ వద్దంటే వద్దని భీష్మించారట. కానీ ఈ లోపే తమన్ గ్లింప్స్‌తో సహా 4 పాటలను రికార్డ్ చేశారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమన్‌ను కంటిన్యూ చేయాల్సి వస్తోందట.

త్రివిక్రమ్ రిక్వెస్ట్‌తో మహేష్ ఇప్పటికి సైలెంట్ అయ్యాడట. త్వరలో రానున్న టీజర్‌కు మ్యూజిక్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తే ఓకే లేదంటే తీసేయాలని త్రివిక్రమ్‌కి మహేష్ గట్టిగా చెప్పారట.

Google News