Mokshagna: మోక్షజ్ఞకు సినీరంగ ప్రవేశంపై యంగ్ హీరో ఆసక్తికర కామెంట్స్..

Mokshagna: మోక్షజ్ఞకు సినీరంగ ప్రవేశంపై యంగ్ హీరో ఆసక్తికర కామెంట్స్..

నందమూరి బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయి కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగటం లేదు. పోనీ మరీ చిన్నవాడా అనుకుంటే మూడు పదుల వయసుకు చేరువవుతున్నాయి.

అనుకున్న సమయానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇప్పటికి ఎన్టీఆర్ మాదిరిగా మంచి స్టార్ అయ్యుండేవాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరో అయ్యాడని కానీ మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు చేరవవుతున్నా హీరో కావడం లేదని నందమూరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ ఇప్పటికే పలు మార్లు బాలయ్యను కూడా ప్రశ్నించారు. ఆయన కూడా ప్రతి ఏడాది ఏదో ఒక కారణం చెబుతున్నారు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు.

 బెల్లంకొండ గణేష్

నిజానికి మోక్షజ్ఞకు ఇండస్ట్రీలోకి రావాలని లేదని టాక్ నడుస్తోంది. బాలయ్య మాత్రం తన కొడుకును హీరోగా చేయాలని పట్టుదలతో ఉన్నారట. ఇక తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీపై యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మోక్షజ్ఞ తనకు ఫ్రెండ్ అని త్వరలో హీరో అవుతాడని.. దాని కోసం సన్నద్ధమవుతున్నాడని వెల్లడించాడు. అంతేకాదు.. కనుబొమ్మలతో నటించగల అద్భుతమైన నటుడు మోక్షజ్ఞ అని గణేష్ ప్రశంసలు కురిపించాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!