Venkatesh: రానా నాయుడు బోల్డ్ సీన్స్‌పై స్పందించిన వెంకీ..

Venkatesh: రానా నాయుడు బోల్డ్ సీన్స్‌పై స్పందించిన వెంకీ..

టాలీవుడ్ ఫ్యామిలీ హీరోస్ లిస్ట్‌లో విక్టరీ వెంకటేష్(Venkatesh) ముందుంటారు. వెంకీ ఖాతాలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అలాంటిది.. రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ చూశాక ప్రేక్షకుల ఫీజులు ఎగిరిపోయాయి. రానా నాయుడు వెబ్ సిరీస్ తో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. వెంకీ ఇలాంటి వెబ్ సిరీస్ చేస్తారని ఎవరూ ఊహించి కూడా ఉండరు. తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్‌పై వెంకీ స్పందించారు.

కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్‌లో రానాతో కలిసి వెంకీ నటించారు. వెంకీకి గతంలో ఉన్న ఇమేజ్‌కి భిన్నంగా ఉందీ వెబ్ సిరీస్. వెంకీ నటించారనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా రిలీజ్ అవగానే టీవీల ముందు ప్రత్యక్షమయ్యారు. కానీ తొలి ఎపిసోడ్ చూడగానే ఫీజులు ఎగిరిపోయాయి. ఈ వెబ్ సిరీస్ అంతా డబల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్‌తో నిండిపోయింది. ఇక అంతే.. విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.

Venkatesh: రానా నాయుడు బోల్డ్ సీన్స్‌పై స్పందించిన వెంకీ..

అయితే సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అహింస చిత్రం ప్రెస్ మీట్‌లో భాగంగా రానా నాయుడు వెబ్ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాల గురించి వెంకటేష్ మాట్లాడారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని.. అయితే బోల్డ్ సీన్స్ గురించి ఆలోచించడం మానేసి ముందుకు వెళ్లడం మంచిదన్నారు. ఫస్ట్ సీజన్‌పై కొన్ని సీన్స్ ప్రభావం చూపాయని.. నెక్ట్స్ సీజన్ మాత్రం అందరికీ నచ్చేలా ఉంటుందని వెంకీ వెల్లడించారు.

Google News