Bhola Shankar First Song: ‘భోళాశంకర్’ ఫస్ట్ సాంగ్.. ప్రాసతో లాగించేశారంటున్న ఫ్యాన్స్..

Bhola Shankar First Song: ‘భోళాశంకర్’ ఫస్ట్ సాంగ్.. ప్రాసతో లాగించేశారంటున్న ఫ్యాన్స్..

మెహర్ రమేశ్(Meher Ramesh) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్’(Bhola Shankar). ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ తమన్నా.. సోదరి పాత్రలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై కేఎస్ రామారావు, రామబ్రహ్మం సుంకర.. భోళా శంకర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. మరి ఈ సాంగ్‌పై టాక్ ఎలా ఉంది?

 ‘అదిరే స్టయిలయ్యా..పగిలే స్వాగయ్యా..యుఫోరియా నా ఏరియా..భోళా మేనియా’ అంటూ మొదలైన ఈ పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. మొత్తానికి ఈ సాంగ్‌ను ప్రాస మిస్ అవకుండా రామజోగయ్య శాస్త్రి రాసుకొచ్చారు. ఎగస్ట్రాలు..కొలెస్ట్రాలు.. వంటి పదాలను కూడా కాస్త గట్టిగానే వాడారు. దీనికోసం సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాగానే కష్టపడ్డారు. కానీ చిరు ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సాంగ్ పెద్దగా ఎక్కడం లేదు. 

మాస్.. ఊరమాస్.. వీరమాస్ అంటూ రెగ్యులర్ ఫార్మాట్ పదాలను ఈ సాంగ్‌లో వాడారు. ఇక మహతి స్వర సాగర్ వచ్చేసి మెలోడి లేదంటే క్లాస్ సాంగ్స్‌కి ప్రాణం పోస్తారు. కానీ ఇలాంటి మాస్ సాంగ్స్ చాలా కష్టం. దేవీ ట్యూన్‌లను కాపీ కొట్టినట్టుగా అనిపిస్తోంది తప్ప సొంతంగా చేసిందేమీ లేదు. మొత్తానికి ఈ సాంగ్ ఒక రకంగా తయారైందని పలువురు అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం కక్కలేక మింగలేక ఏదో పాట సూపర్ అంటున్నారట.

Google News