Anasuya Bharadwaj: అనసూయ ఎమోషనల్ అవుతూనే అందాల ఆరబోత.. బాబోయ్ మామూలుగా లేదుగా..!

Anasuya Bharadwaj: అనసూయ ఎమోషనల్ అవుతూనే అందాల ఆరబోత.. బాబోయ్ మామూలుగా లేదుగా..!

అనసూయ(Anasuya Bharadwaj) తన పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసి థాయ్‌లాండ్‌(Thailand)కు చెక్కేసింది. అక్కడి బీచ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా హాట్ హాట్‌గా ఉన్నాయా పిక్స్. వాటిపై సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఓ రేంజ్‌లో వస్తోంది. బికినీ వేసుకుని మరీ భర్త భరద్వాజ్‌కు లిప్ కిస్‌లు ఇస్తూ ఫోటోలు తీసుకుని వాటిని ఇన్‌స్టా గ్రాంలో షేర్ చేసింది.

Anasuya Bharadwaj: అనసూయ ఎమోషనల్ అవుతూనే అందాల ఆరబోత.. బాబోయ్ మామూలుగా లేదుగా..!

ఇక ఈ ఫోటోలకు తోడు భర్తపై ప్రేమను కుమ్మరిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 2001లో భరద్వాజ్ తనకు ప్రేమ లేఖ రాశారని.. అప్పుడు రిప్లై ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నానని పేర్కొంది. ఇన్నేళ్లలో తన కారణంగా భరద్వాజ్ ఎన్నో అవమానాలు భరించారని.. ఎందరో ఎన్నో రకాల మాటలు అన్నారని.. కానీ అవేమీ పట్టించుకోకుండా తనపై ప్రేమను చూపిస్తూనే ఉన్నారని అనసూయ(Anchor Anasuya) తన పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.

Anasuya Bharadwaj: అనసూయ ఎమోషనల్ అవుతూనే అందాల ఆరబోత.. బాబోయ్ మామూలుగా లేదుగా..!

తన కోసం భరద్వాజ్ ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొంది. ఒక్కోసారి తనను భరిస్తూ ఆయన చూపించే ఓపిక చూస్తుంటే తనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుందని తెలిపింది. ఒకరినొకరం అర్థం చేసుకుని సాగుతున్నామని.. తామిద్దరం పర్ఫెక్ట్ కపుల్ కాదు కానీ కష్టనష్టాల్లో తోడు ఉంటున్నామని పేర్కొంది. తనను తననుగా స్వాగతించింనందుకు భర్త భరద్వాజ్‌కు అనసూయ ధన్యవాదాలు తెలిపింది. మొత్తానికి అనసూయ తన భర్తపై ప్రేమను ఇలా చూపించింది.

Google News