Top 5 Heroines: సోషల్ మీడియా ద్వారా తెగ సంపాదిస్తున్న హీరోయిన్స్‌లో టాప్ 5 ఎవరంటే..

Top 5 Heroines: సోషల్ మీడియా ద్వారా తెగ సంపాదిస్తున్న హీరోయిన్స్‌లో టాప్ 5 ఎవరంటే..

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని బాగా ఫాలో అవుతుంటారు సినీ స్టార్స్. ఇక ఈ మధ్య కాలంలో అయితే సినిమాల్లోనే కాదు.. కమర్షియల్‌గా కూడా తమ ఇమేజ్‌ను తెగ వాడేస్తున్నారు. గతంలో స్టార్స్ అంతా సినిమాల్లో మాత్రమే మెరిసేవారు. కానీ ఆ తరువాత టీవీ యాడ్స్‌లో.. ఇక ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా ప్రమోషన్స్‌లో మెరుస్తూ ఎడాపెడా సంపాదించేస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన ప్రమోషన్లలో బీభత్సంగా మెరుస్తున్నారు. ప్రమోషన్స్ ద్వారా రూ.కోట్లు వెనుకేసుకుంటున్న టాప్ 5 హీరోయిన్స్ ఎవరో చూద్దాం. 

ప్రమోషన్స్ ద్వారా రూ.కోట్లు వెనుకేసుకుంటున్న హీరోయిన్స్‌లో తొలి స్థానంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఉంది. అమ్మడు హాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యాక క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరి కంటే అత్యధిక ఫాలోయర్స్ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. అమ్మడు తన ఇన్‌స్టాలో ప్రమోట్ చేసేందుకు రూ.2 కోట్ల తీసుకుంటోందట. ఇక రెండో స్థానంలో దీపిక పదుకొనే(Deepika Padukone) ఉంది. ఆమె ఒక్కో యాడ్‌కి రూ. కోటి నుంచి రూ.2 కోట్లు అందుకుంటోందట.

Top 5 Heroines: సోషల్ మీడియా ద్వారా తెగ సంపాదిస్తున్న హీరోయిన్స్‌లో టాప్ 5 ఎవరంటే..

ఇక సోషల్ మీడియా యాడ్స్ ద్వారా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్‌లో కత్రినా(Katrina Kaif) మూడో స్థానంలో ఉంది. ఆమె ఒక్కో యాడ్‌కు రూ.కోటి తీసుకుంటోందట. ఇక నాలుగవ స్థానంలో ఆలియా భట్(Alia Bhatt) ఉంది. అమ్మడి రీచ్ కూడా పోస్టులకు ఓ రేంజ్‌లో ఉంటుందట. దీంతో ఒక్కో యాడ్ కోసం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక ఐదో స్థానంలో శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ఉంది. అమ్మడు ఒక్కో యాడ్ కోసం రూ.50 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటోందట.

Google News