Siddharth: అదితితో ప్రేమ వ్యవహారంపై సిద్దార్థ్ ఏమన్నాడంటే..

Siddarth: అదితితో ప్రేమ వ్యవహారంపై సిద్దార్థ్ ఏమన్నాడంటే..

హీరో సిద్దార్థ్(Siddharth) గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. బొమ్మరిల్లు సినిమాతో తెగ పాపులర్ అయిపోయాడు. ఇక ఆ మధ్య మహా సముద్రం(Maha Samudram) తదితర సినిమాల్లో కనిపించినా కూడా ఎందుకో ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ను సాధించలేదు. అయితే మహా సముద్రం సినిమా కారణంగా మాత్రం సిద్దార్థ్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్‌గా నటించింది. శర్వానంద్, సిద్దార్థ్‌లతో మల్టీస్టారర్ మూవీగా ఇది తెరకెక్కింది. 

ఆ సినిమా సమయంలో సిద్దు మరియు అదితి(Adithi Rao Hydari) మధ్య రిలేషన్ ఏర్పడినట్టు టాక్ నడుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారట. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అయితే సిద్ధు మాత్రం తన రిలేషన్‌షిప్ వ్యవహారాన్ని బయటకు చెప్పేందుకు మాత్రం నిరాకరిస్తున్నాడు. అంతకుముందు ఓ సందర్భంలో అదితి కూడా వీరిద్దరి రిలేషన్‌పై ప్రశ్న ఎదురైనా చెప్పేందుకు నిరాకరించింది. 

Siddarth: అదితితో ప్రేమ వ్యవహారంపై సిద్దార్థ్ ఏమన్నాడంటే..

అయితే ఇటీవల సిద్దార్థ్(Siddharth) నటించిన సినిమా ఒకటి తెలుగులో విడుదలకు సిద్ధమైంది. అయితే మీడియా అసలు విషయాల కంటే ఇలాంటి విషయాలకే ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి సిద్ధుని అదితితో రిలేషన్‌పై ప్రశ్నించింది. కానీ సిద్దు మాత్రం తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. సమయం వచ్చినట్టు చెబుతానంటూ దాట వేశాడు. వ్యక్తిగత విషయాలు కెరీర్‌కు అడ్డం కాకూడదనే భావనలో సిద్దు ఉన్నట్టు తెలుస్తోంది.

Google News