Karthi: 13 ఏళ్ల క్రితం సినిమాకి సీక్వెల్ ఏంటి? కార్తీపై ఫ్యాన్స్ ఆగ్రహం

Karthi: 13 ఏళ్ల క్రితం సినిమాకి సీక్వెల్ ఏంటి? కార్తీపై ఫ్యాన్స్ ఆగ్రహం

ఏదైనా సినిమాకు సీక్వెల్‌ను వెంటనే మొదలు పెడతారు. లేదంటే ఒకటి.. రెండేళ్లు గ్యాప్ తీసుకుని మొదలు పెడతారు. కానీ ఇదేంటో 13 ఏళ్ల తర్వాత ఓ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన దర్శకుడికి రావడం.. దానిని హీరోకి చెబితే తొలుత నో అని తర్వాత ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పుడా మూవీ డైరెక్టర్, సంగీత దర్శకుడు ఎవరూ ఫామ్‌లో లేరు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా? ఆవారా.

హీరో కార్తీ(Karthi) నటించిన ఆవారా(Aawara) అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. రెండు భాషల్లో విడుదలైన ఈ చిత్రం రెండు చోట్లా ఘన విజయం సాధించింది. అయితే లింగు స్వామి(Lingu Swamy) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిట్‌కు మెయిన్ కారణం వచ్చేసి.. మ్యూజిక్. ఆ పాటలు ఇప్పటికీ వింటుంటే చాలా మంచి ఫీల్ ఇస్తాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారట. అనుకున్నదే తడవుగా కార్తీని సంప్రదిస్తే నో చెప్పేశాడట.

Karthi: 13 ఏళ్ల క్రితం సినిమాకి సీక్వెల్ ఏంటి? కార్తీపై ఫ్యాన్స్ ఆగ్రహం

ఆ తర్వాత లింగుస్వామి.. ఆవారా 2ను హీరో ఆర్యతో రూపొందించాలనుకున్నారట. కానీ ఆయన కూడా నో చెప్పారట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి సినిమా కార్తీ వద్దకే వచ్చిందట. కార్తీ తొలుత నో చెప్పినా కూడా ఇప్పుడు ఓకే చెప్పాడని టాక్. దీంతో ఫ్యాన్స్ కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెలే అస్సలు సెట్ అవదనుకుంటుంటే.. దర్శకుడు లింగు స్వామి, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇద్దరూ ఫామ్‌లో లేరు. మరి అలాంటప్పుడు సినిమా ఎలా సక్సెస్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

Google News