Prabhas: ప్రభాస్ సంచలనం.. కృతిసనన్ సమక్షంలోనే పెళ్లి ప్రకటన చేసి షాకిచ్చాడు..

Prabhas: ప్రభాస్ సంచలనం.. కృతిసనన్ సమక్షంలోనే పెళ్లి ప్రకటన చేసి షాకిచ్చాడు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా క‌ృతిసనన్(Kriti Sanon), బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ముందుగానే తిరుపతి(Tirupathi)కి చేరుకున్న ప్రభాస్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం నిన్న సాయంత్రం ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్‌లో కృతిసనన్ సమక్షంలోనే తన పెళ్లిపై ప్రభాస్ అధికారిక ప్రకటన చేశాడు. ప్రభాస్(Prabhas) కనిపించగానే ముందుగా వినిపించే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు? ప్రస్తుతం ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కూడా అభిమానులు పెళ్లి ఎప్పుడంటూ కేకలతో హోరెత్తించారు.

ఇక తన పెళ్లిపై ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్థితిలో ప్రభాస్ (Prabhas) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తను పెళ్లంటూ చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటానని, ఎప్పుడు అనేది అతి త్వరలోనే వెల్లడిస్తానని స్పష్టం చేశాడు.

గత కొన్ని రోజులుగా ప్రభాస్-కృతి సనన్ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఆమె ఎదుటే పెళ్లిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

Google News