Om Raut: శ్రీవారి ఆలయం ముందు ముద్దులతో రెచ్చిపోయిన ‘ఆదిపురుష్’ డైరెక్టర్

Om Raut: శ్రీవారి ఆలయం ముందు ముద్దులతో రెచ్చిపోయిన ‘ఆదిపురుష్’ డైరెక్టర్

రోమ్‌లో ఉన్నప్పుడు ఒక రోమన్ మాదిరిగానే ప్రవర్తించాలనేది పెద్దలు చెప్పే మాట. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుని మసలు కోవాలి. కానీ ‘ఆదిపురుష్’(Adipurush) డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) మాత్రం ఇవన్నీ విస్మరించారు. ఎక్కడున్నా తనకేం పట్టదు అన్నట్టుగా ప్రవర్తించి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. ఇక అంతే.. ఇటు బీజేపీ(BJP) నేతలు, అటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనను ఏకి పారేస్తున్నారు.

ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్‌(Adipurush Pre Release Event) తిరుపతి(Tirupati)లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ హీరో ప్రభాస్(Prabhas), హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon), దర్శకుడు ఓం రౌత్(Om Raut) సహా చిత్ర యూనిట్ హాజరైంది. దీనికి ముందు హీరో, హీరోయిన్లు, దర్శకుడు తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని చిత్రం మంచి సక్సెస్ సాధించాలని పూజలు చేయించారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది.. బయటకు వచ్చిన వెంటనే.. ఆలయం ఎదురుగానే ఓం రౌత్.. సీత పాత్రధారిణి అయిన కృతి సనన్‌కు హగ్ ఇచ్చి ముద్దు పెట్టారు.

Om Raut: శ్రీవారి ఆలయం ముందు ముద్దులతో రెచ్చిపోయిన ‘ఆదిపురుష్’ డైరెక్టర్

ఓం రౌత్(Om Raut) చేసిన పనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత బాలీవుడ్‌లో ఇది కామన్ అయినా కూడా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయం ఎదుట ఇది కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. అసలు వీరికి భక్తి లేదని.. కేవలం భక్తిని అమ్ముకోవటమే వీరి పని అంటూ మండిపడుతున్నారు. మరోవైపు ముద్దులు, హగ్గులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు అంగీకారం కాదని బీజేపీ నేత రమేష్ నాయుడు మండిపడ్డారు.

Google News