Urvashi Rautela: ఐటెం సాంగ్స్ కోసం ఈ అమ్మడు ఎంత తీసుకుంటోందో తెలిస్తే..

Urvashi Rautela: ఐటెం సాంగ్స్ కోసం ఈ అమ్మడు ఎంత తీసుకుంటోందో తెలిస్తే..

ఐటెం సాంగ్స్‌కి సినిమాలోనూ బయట మాంచి క్రేజ్ ఉంటుంది. అందుకే దీని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు. ప్రస్తుతం అయితే.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కి ఐటెం సాంగ్స్ పరంగా అదిరిపోయే డిమాండ్ ఉంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా కంటే కూడా ఐటెం సాంగ్స్‌తోనే తెగ ఫేమస్ అయిపోయింది. ఈ బ్యూటీని హీరోయిన్.. ఒక్కో ఐటెం సాంగ్‌ కోసం ఎంత తీసుకుంటోందో తెలిస్తే అవాక్కవుతారు.

అమ్మడు విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకుంది. అలాంటప్పుడు హీరోయిన్‌గా ఎంత గిరాకీ ఉండాలి. కానీ ఈ ముద్దుగుమ్మను హీరోయిన్‌గా తీసుకోవడం కంటే ఐటెం సాంగ్స్ కోసం తీసుకోవడానికే దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. దీనికి అమ్మడు హైట్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి ఆమె హైట్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

Urvashi Rautela: ఐటెం సాంగ్స్ కోసం ఈ అమ్మడు ఎంత తీసుకుంటోందో తెలిస్తే..

అమ్మడికి సౌత్‌లోనూ డిమాండ్ ఎక్కువే. ఇప్పటికే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య(Waltair Veerayya) సినిమాలో బాస్ పార్టీ సాంగ్‌లో చిరంజీవి(Chiranjeevi)తో స్టెప్పులు వేసింది. అలాగే ఏజెంట్ చిత్రంలోనూ తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసింది. దీంతో అమ్మడి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఒక్క సాంగ్‌కి రూ.3 కోట్ల వరకూ నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారట. ఇది స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్‌తో సమానం కావడం విశేషం.

Google News