GPS: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
మాట ఇస్తే నిలబెట్టుకోవడం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వభావం. ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి తన నిబద్ధతని చాటుకున్నారు సీఎం జగన్.
పాదయాత్ర సందర్భంగా జగన్ ఉద్యోగులకు మాట ఇచ్చారు. పెన్షన్ స్కీమ్ విషయంలో ఇఛ్చిన మాట ప్రకారం గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ (GPS) తీసుకొచ్చారు. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (CPS) కన్నా మరింత ఉపయోగకరమైనది ఈ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ (GPS). ఐతే CPS కన్నా ఇది ఏ విధంగా కూడా సరితూగదని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రతిపక్షాల గోల ఎలా ఉన్నా ఈ GPSలో ఉన్న లాభాలు ఏంటో చూద్దాం. మచ్చుకు కొన్ని…
- ఇది కూడా సీపీఎస్ కి అనుగుణంగానే ఉంటుంది.
- ఉద్యోగి 10 శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం జత చేస్తుంది.
రిటైర్ అయ్యేముందు తీసుకునే చివరి జీతం బేసిక్‌లో 50శాతం పెన్షన్‌గా అందుతుంది. సీపీఎస్‌తో పోలిస్తే 150శాతం అధికంగా ఉద్యోగికి అందుతుంది.
- దీనికి తోడు ఏడాదికి రెండు డీఆర్లు
- చివరి నెలబేసిక్ జీతం రూ.1 లక్ష ఉంటే.. అందులో రూ.50వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి 2 డీఆర్‌లతో కలుపుకుని ఇది ప్రతిఏటా పెరుగుతూనే ఉంటుంది.
- సీపీఎస్‌లో ఇలాంటి వెసులుబాటే లేదు 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు రూ.1,33,506 కోట్లుకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగులకు ఉభయతారకంగా మేలు జరిగేలా రూపొందించారు అని చెప్పొచ్చు.