Kesineni Nani: టీడీపీ ఇన్‌చార్జులంతా గొట్టంగాళ్లంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani: టీడీపీ ఇన్‌చార్జులంతా గొట్టంగాళ్లంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

ఇటీవలి కాలంలో ఎంపీ కేశినేని నాని తన సొంత పార్టీపైకే బాణాలను ఎక్కువగా ఎక్కుపెడుతున్నారు. ఇక అధికార పార్టీపై అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పోనీ అలాగని ఏమైనా పార్టీ మారుతారా? అంటే మారే ఉద్దేశమే లేదని.. కానీ చిర్రెత్తితే మాత్రం ఆలోచిస్తానన్నారు. టీడీపీ ఇన్‌చార్జులంతా గొట్టంగాళ్లంటూ సంచలనానికి తెరదీశారు. ఎవరో ఏదో తన గురించి ఏదో ప్రచారం చేశారని తాను పట్టించుకోబోనని.. తాను ఏది చేసినా పొగిడే వాళ్లు.. తిట్టేవాళ్లూ ఉంటారన్నారు. తాను ఏం చేస్తాననే విషయమై తనకు స్పష్టత ఉందని కేశినేని నాని స్పష్టం చేశారు. తనకు ప్రజల్లో మంచి పేరు ఉందని.. అందుకే అన్ని పార్టీల్లోనూ తన గురించి చర్చ నడుస్తోందన్నారు.

ప్రజాప్రతినిధిగా గెలిచాక ప్రాంతం, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని.. ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకున్నా కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తానని కేశినేని నాని అన్నారు. విజయవాడ ప్రజలతంతా తనతో కంఫర్ట్‌గా ఉన్నారన్నారు. తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదని వెల్లడించారు. రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలతో పని లేదంటూ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టిన టీడీపీ ఆఫీస్‌ ఓపెనింగ్‌కు సైతం తనకు ఆహ్వానం లేదన్నారు. ఇన్‌చార్జిల పేరుతో హడావుడి చేసే వాళ్లు గొట్టంగాళ్లని కేశినేని నాని నిందించారు.

Google News