లోకేష్ ఆరోపణలు నిజమేనా? సోషల్ మీడియాలో లిస్ట్ తీసి మరీ ఏకిపారేస్తున్న వైసీపీ ఫ్యాన్స్..

లోకేష్ ఆరోపణల్లో నిజమేనా? సోషల్ మీడియాలో లిస్ట్ తీసి మరీ ఏకిపారేస్తున్న వైసీపీ ఫ్యాన్స్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా మాటల్లో పదును పెంచారు. వైసీపీ ప్రభుత్వం రెడ్లను ఇబ్బంది పెడుతోందని లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, పెద్దరెడ్డి, సజ్జల మాత్రమే ఈ ప్రభుత్వంలో బాగు పడ్డారని చెబుతున్నారు. విజిలెన్స్‌ ఎంక్వైరీ పేరిట రెడ్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. జగన్ పాలనలో నష్టపోయింది రెడ్లేనని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని నారా లోకేష్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నీ తండ్రి పాలనలో రెడ్లను ఎలా వేధించారో ఒక్కసారి చూసుకోవాలని చెబుతున్నాయి.

మీరు వేధించిన అధికారుల లిస్ట్ చూడండి..

టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో వేధించిన అధికారుల లిస్ట్‌ను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. అదేంటంటే..

  • వైఎస్‌తో సన్నిహితంగా ఉన్నారని నాడు విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఉన్న రమాకాంత్ రెడ్డిని వేధించిన విషయం మరిచారా?
  • సీనియర్ ఐపీఎస్ అధికారి , పైగా సర్వీసులో ఏ మచ్చ లేని డీజీపీ ఆంజినేయ రెడ్డిని కేవలం కుల వివక్ష కారణంగా వేధించడమే కాకుండా.. ఆయనను పక్కన పెట్టి రాములు గారికి అవకాశం ఇవ్వలేదా?
  • మరో ఐపీఎస్ అధికారి దినేష్ రెడ్డి ని కేవలం కుల వివక్ష కారణంగా నాలుగేళ్ళు పక్కన పెట్టలేదా ?
  • ఇంకో ఐపీఎస్ అధికారి గోపీనాథ్ రెడ్డి కూడా మీ కుల వివక్షకు గురి కాలేదా?
  • చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని పలు కేసుల్లో ఇరికించి పోలీస్ వ్యానులో కిలోమీటర్ల కొద్దీ తిప్పి స్టేషన్‌లో పెట్టి కొట్టిన ఘటనను ఆయన శాసన సభలోనే వివరించిన సంగతి మరిచారా ?
  • అంతెందుకు రెడ్లపై అవ్యాజమైన ప్రేమ చూపిస్తున్న లోకేష్ ఆయన తండ్రి సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డిని ఎలా టార్గెట్ చేశారో లోకానికి తెలుసు. ఎల్లో మీడియా, తన చెంచా అధికారులతో కలిసి జగన్, దివంగత వైఎస్‌ల వ్యక్తిత్వాలను ఎంతలా దిగజార్చి రాక్షసానందం పొందారో మర్చిపోయారా?

ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కులం మాటున మీరు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉంది. అధికారం కోసం రెడ్లపై ప్రేమ నటించడం ఆ తరువాత రెడ్లపై అన్ని రకాలుగా దాడులు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని జనాలు తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు కాదని ఏకి పారేస్తున్నారు. అవసరానికొక తీరున మారిపోయే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు లోకేష్? అంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.

Google News