NTV: టీవీ9కి నిద్రపట్టకుండా చేస్తోన్న ఎన్టీవీ

NTV no 1 in BARC ratints 2023

తెలుగుటీవీ న్యూస్ రంగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపింది ఎన్టీవీ (NTV). తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ తో ఎన్టీవీ (NTV) తన అగ్రస్థానాన్ని ఘనంగా చాటింది.

71.9 టీఆర్పీల‌తో ఫస్ట్ ప్లేస్‌ లో నిలిచింది NTV. టీవీ9(TV9) మళ్ళీ రెండో స్థానంతోనే సరిపెట్టుకొంది.

‘ప్రతి క్షణం-ప్రజా హితం’ అనే స్లోగ‌న్‌ తో నడుస్తోంది ఎన్టీవీ. బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడంలో, రాజకీయ విశ్లేషణలు అందించడంలో NTV శైలి భిన్నం. అదే జనాలని ఆకర్షిస్తోంది. ఒక పక్షం వైపే ఉంటూ వార్తల్లో కూడా పక్షపాతం చూపే ఛానెల్స్ ఉన్న కాలంలో వీలైనంత వరకు ప్రజ‌ల పక్షాన నిల‌బ‌డుతుండ‌ట‌మే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిల‌బెడుతోంది.

NTV no 1 in BARC ratints 2023

మళ్ళీ ఎన్టీవీ నెం.1గా నిల‌వ‌డంతో ఆ ఛానెల్ సిబ్బంది సంబరాల్లో ఉన్నారు. మరోవైపు, ఒకప్పుడు మార్కెట్ లీడర్ గా ఉన్న టీవీ9 పరేషాన్ లో ఉంది. ఎన్ని తిప్పలు పడ్డా నెంబర్ వన్ గా నిలవలేకపోతోంది. మధ్యలో రెండు వారాలు మొదటి స్థానంలోకి వచ్చినా ఆ మురిపెం మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. అలా టీవీ9కి నిద్రలేకుండా చేస్తోంది ఎన్టీవీ.

Google News