వైసీపీకి సాయం.. టీడీపీతో పొత్తు.. బీజేపీ స్కెచ్ ఏంటంటే..!

వైసీపీకి సాయం.. టీడీపీతో పొత్తు.. బీజేపీ స్కెచ్ ఏంటంటే..!

ఏపీ(Andhra Pradesh)లో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలకు తరుణం ఆసన్నమైంది. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ప్రాపకం కోసం అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక బీజేపీ తీరు ఆసక్తికరంగా మారింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అటు వైసీపీ అధినేత జగన్‌(YS Jagan)ను వదలడం లేదు.. ఇటు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra Babu)నూ చేరదీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబే టార్గెట్‌గా బీజేపీ నేతలు వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వైసీపీ(YSRCP)కి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.

వైసీపీకి అడిగినప్పుడల్లా నిధులిస్తూ.. అలాగే కేసుల విషయంలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఆ పార్టీని పక్కనే పెట్టుకున్నారు ప్రధాని మోదీ(PM Modi). ఇటు ఏపీలో ఈసారి టీడీపీతో పొత్తుకు సంకేతాలిస్తు్న్నారు. ఇదేం రాజకీయమో తెలియక జనాలు అయోమయంలో ఉన్నారు.

ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. రెండు పార్టీలకు అనుకూలంగానే కనిపిస్తున్న బీజేపీ ఎవరికి హ్యాండ్ ఇస్తుంది? ఎవరికి సపోర్ట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఏడాది చివర్లో తెలంగాణ(Telangana) ఎన్నికల తర్వాత పరిస్ధితుల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎవరినీ నొప్పించక.. తానివ్వక నడుచుకుంటోందని టాక్.

Google News