స్థాయి మరిచిన జన సైనికులు.. ఏకంగా చిరంజీవిపైనే కామెంట్స్.. లైట్ తీసుకోమన్న నాగబాబు

స్థాయి మరిచిన జన సైనికులు.. ఏకంగా చిరంజీవిపైనే కామెంట్స్.. లైట్ తీసుకోమన్న నాగబాబు

గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిస్తున్నట్టు ఉంది జనసైనికుల తీరు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి లేకుంటే జనసేన ఉండేది కాదు.. అసలు పవన్ కల్యాణ్ ఉండేవారు కాదు. సినీరంగ ప్రవేశమే చిరు తమ్ముడిగా జరిగింది. ఆపై చిరు తమ్ముడిగానే ఎదిగారు. ఆ తరువాత జనసేన పార్టీ. అలాంటి చిరంజీవిని ప్రశ్నించే స్థాయికి పవన్ అభిమానులు చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి పవన్‌కు నిలకడ లేదనే విషయం అందరికీ తెలిసిందే అంటూ, మాటల్లో స్థిరం ఉండదు.. ఊగిపోతూ ప్రసంగాలు చేయడం తప్ప రోజురోజుకూ మాటలు మార్చడమనేది సమాజం గమనిస్తూ వస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఆయన్ను సినిమా హీరోగా తప్ప రాజకీయ నాయకుడి మాదిరిగా జనం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. పలు సందర్భాల్లో పవన్ తన మీటింగ్‌లకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు తప్ప ఓట్లు మాత్రం వేయడం లేదని తెలిపారు. అందుకే రెండుచోట్లా ఓడిపోయిన రికార్డ్ మిగిలిపోయింది. అయితే ఓట్లు వేయడానికి.. నాయకుడిగా గుర్తించడానికి ప్రజలు కొన్ని అర్హతలు నిర్ణయిస్తారు. అవేమి పవన్ కళ్యాణ్‌లో లేకపోవడంతో ఆయన్ను తిరస్కరించారని రాజకీయ నిపుణులు అంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని . అంగీకరించలేని పవన్ అభిమానులు, ఇప్పుడు ఏకంగా చిరంజీవిని నిందిస్తుండటం గమనార్హం.  

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయన్ను అసలు సీరియస్ నాయకుడిగా చూడకపోవడానికి ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కారణమని సోషల్ మీడియాలో మొదటి నుంచీ యాక్టివ్ గా ఉండే రాయపాటి అరుణ అనే వీర మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్‌ను ఎవరూ నమ్మడం లేదని, చిరంజీవి ఆనాడు పార్టీని విలీనము చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే తాము ఇప్పుడు బాధ పడుతున్నాం అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపాయి. 

అసలు చిరంజీవి లేకున్నా ఆయన ప్రోత్సాహం లేకున్నా పవన్ అనే వ్యక్తి ఎవ్వరికీ తెలిసి ఉండేవాడు అయితే కాదు. ఈ విషయాన్ని మరిచిన జన సైనికులు ఇప్పుడు చిరంజీవినే విమర్శిస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇక తమ అభిమాన హీరోపై లేనిపోని విమర్శలు చేస్తే చిరు ఫ్యాన్స్ ఊరుకుంటారు. కాస్త ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. ‘మా అన్నయ్యకు విలీనం చేయడానికి ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు .. మీకు అదీ దిక్కులేదు.. ఊరుకోండి’ అని ఒకరు అంటే.. ‘ మీకు గెలవడం చేతగాక మా అన్నయ్యను అంటారా?’ అని మరొకరు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు.

స్థాయి మరిచిన జన సైనికులు.. ఏకంగా చిరంజీవిపైనే కామెంట్స్.. లైట్ తీసుకోమన్న నాగబాబు

లీవిట్.. వదిలేయండమ్మా…

ఇదిలా ఉండగా ఈ తగాదా ముదిరి ఇటు చిరు.. అటు పవన్ ఫ్యాన్స్ ఇలా మాటలు విసురుకోవడంతో నాగబాబు లైన్లోకి వచ్చారు. ‘లీవిట్.. వదిలేయండమ్మా… ఆమె తెలిసీ తెలికుండా ఫ్లో‌లో అలా అనేసింది’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న మహిళ.. కాబట్టి పట్టించుకోవద్దంటూ నాగబాబు శాంతపరిచారు. తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేస్తే చేసారు కానీ.. పవన్ అసమర్థతకు … చంద్రబాబు దగ్గర సరెండర్ అయి ఉండడానికి చిరంజీవికి ఏం సంబంధం? అని చిరు అభిమానులు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి చిరంజీవి నీడన ఎదిగిన పవన్, ఆ విషయాన్నీ గుర్తించని జనసైనికులు పెద్ద అజ్ఞానులు అని చిరు ఫాన్స్ అంటున్నారు.