లేడీ సింగం… బీసీ అయినందుకేనా పవన్ కోపం.. యాదవ సంఘాల గుర్రు

లేడీ సింగం... బీసీ అయినందుకేనా పవన్ కోపం.. యాదవ సంఘాల గుర్రు

ఏపీలో కులాల పంచాయతీ ఎక్కువ. ఇక్కడ కులాలే అజెండాగా రాజకీయం కొనసాగుతూ ఉంటుంది. తాజాగా శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజూ యాదవ్ తమ కార్యకర్తను కొట్టడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే పవన్ ఒక్కసారి ఆమె అలా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? కేవలం సాయి అనే కార్యకర్తను మాత్రమే ఎందుకు కొట్టారు? సాయికి అంజూ యాదవ్‌కు మధ్య ఆస్తి తగాదాలేమైనా ఉన్నాయా? యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజూ యాదవ్‌కు కక్షలు కార్పణ్యాలు ఉండే అవకాశం ఉందా? అలాంటివి ఏం లేవు. మరి ఎందుకు కొట్టారు? అంటే కారణం పోలేదని అంటున్నారు.

సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ… అది కూడా రావణుడి మాదిరిగా పది తలలతో కూడిన దిష్టిబొమ్మను తగులబెడుతూ తలమీద కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొందట. ఇక వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు. లాఠీఛార్జ్ చేయాల్సిన ఉద్రిక్తత ఉన్నా కాస్త సామరస్యంగా పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంప దెబ్బ కొట్టారు. ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పెత్తందారు పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని యాదవ వర్గాలు గుర్రుమంటున్నాయి.

ఆమెను సైతం ఇలాగే దండించారు..

అంజూ యాదవ్ వచ్చేసి డ్యూటీలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ల విషయంలోనూ అంతే కఠినంగా ఉంటారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఓ ధర్నాలో పాల్గొనగా ఆమెను సైతం ఇలాగే దండించి శాంతి భద్రతలు కాపాడారు. పార్టీ ఏదైనా సరే.. శాంతి భద్రతలకు.. సామాజిక ప్రశాంతతకు విఘాతం కలిగితే ఏమాత్రం సహించలేని అంజూ యాదవ్ అప్పటికప్పుడే పరిస్థితులు అదుపు చేస్తుంటారు.

అయితే ఇలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్న అంజూ యాదవ్ కేవలం బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానించడాన్ని ఆ వర్గం ప్రజలు అంగీకరించడం లేదు. తమ ఆడబిడ్డ ఎదుగుదలను సహించలేని పెత్తందారీ పోకడలున్న పవన్ కళ్యాణ్ ఇలా ఆమెను టార్గెట్ చేస్తున్నారని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మహిళలు స్ఫూర్తివంతంగా ఉండాలి.. ధైర్యంగా ఉండాలి.. అన్యాయాలను ఎదిరించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిన్సియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా బీసీ పోలీస్ అధికారిని టార్గెట్ చేస్తూ ధర్నా చేయడం ఆయన పెద్దరికపు, అహంకారపూరిత మనస్తత్వానికి ప్రతీక అని యాదవ యువత ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు తాము సరైన సమయంలో బుద్ధి చెబుతామని యాదవ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Google News