సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి ఎస్పీకి పవన్ ఫిర్యాదు

సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి ఎస్పీకి పవన్ ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరుపతికి వెళ్లి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డికి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి జనసేన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తిరుపతిలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నేత సాయిపై అంజూయాదవ్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. 

ఎస్పీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో జనసైనికులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఐ చేయిచేసుకున్నారన్నారు. ఈ ఘటనను సుమోటోగా కేసు స్వీకరించినందుకు హెచ్‌ఆర్సీకి ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నం సభకు పెద్ద ఎత్తున జనసైనికులు వచ్చారని.. వారంతా చాలా క్రమశిక్షణతో వ్యవహరించారన్నారు. మచిలీపట్నంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగలేదన్నారు. శ్రీకాళహస్తిలో సీఐ వ్యవహారశైలిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Google News