గుంపుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా జగన్ గెలుపును ఆపలేరంటూ వైసీపీ సవాల్
వైసీపీ నేతలు, ఫ్యాన్స్ జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటూ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. ప్రస్తుతం నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఓటు మట్టం పెరుగుతోందని చెబుతున్నారు. గుంపుగా వచ్చినా.. కూటములు కట్టినా.. సింగిల్‌గా వచ్చినా జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటున్నారు. ఈ మధ్య నేషనల్ మీడియా టైమ్స్ నౌ – నవ భారత్ చేసిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో సంస్థ పోల్ స్ట్రాటజీ చేపట్టిన సర్వేలో సైతం మళ్ళీ అదే ఫలితం రావడంతో వైసీపీ నేతలు, ఫ్యాన్స్ అసలు తగ్గేలా లేరు.
ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి విజయం తధ్యమని తేలింది. ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన కలిసి వెళ్లినా.. సింగిల్‌గా ఎలక్షన్స్‌కి వెళ్లినా విజయం మాత్రం జగన్ వైపే ఉంటుందంటున్నారు. కాస్త ఓట్ల శాతం తగ్గొచ్చేమో కానీ విజయం మాత్రం తథ్యమంటున్నారు. వైసీపీకి 49 శాతం ఓట్లు వస్తాయని.. టీడీపీ, జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఇతరులకు పదిశాతం ఓట్లు వస్తాయి. ఇక సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. పవన్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా బాగుందని 56 శాతం మంది చెప్పగా 22 శాతం మంది బాలేదని అన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా 8 శాతం మంది అసలు బాలేదని అన్నారు. మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2019తో పోలిస్తే వైయస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.
వారంతా జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధం..
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలూ.. చిన్నచిన్న వాడల్లోకి సైతం చేరిపోగా ప్రజలంతా జగన్ కుటుంబంలో భాగమయ్యారు.. ప్రజలు సైతం ఈయన్ను తమ కుటుంబ సభ్యడిలా భావిస్తున్నారు. దీంతో పథకాలు పొందిన లబ్ధిదారులు మొత్తం గంపగుత్తగా జగన్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికితోడు నాడు – నేడు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్య వైద్య రంగాల్లో సాధించిన గణనీయమైన మార్పులు జగన్ పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని ఓటర్లు భావిస్తున్నారు ఇక చంద్రబాబు కూడా అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. అంటూ ఏవేవో చెప్పినా ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు.. అయన గత చరిత్ర తెలిసినవాళ్ళు చంద్రబాబును ఓ అవకాశవాదిగా మాత్రమే చూస్తారు తప్ప ఆయన్ను నమ్మదగిన నాయకుడిగా చూడలేరు. అందుకే మొన్న మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీల టీజర్ ఫెయిల్ అయింది. దానికితోడు గతంలో చాలా హామీలు ఇచ్చి మరిచిన ఆయన్ను మళ్ళీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
పవన్ మాటలతో చంద్రబాబుకు భయం పట్టుకుంది..
టీడీపీ పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేనందున ఈసారి కూడా జగన్‌ను ఎదుర్కొనేందుకు పొత్తులకోసం ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ.. జనసేనలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. అది సరిగ్గా పొసగడం లేదు.. పవన్ మాట్లాడే మాటలు చూస్తే చంద్రబాబుకి భయం వేస్తోందని సమాచారం. ఈయనతో వెళితే మొత్తాన్ని ముంచేసేలా ఉన్నాడనే సంశయం మొదలైందని తెలుస్తోంది. అలాగని పొత్తులేకుండా వెళితే ఓటమి పక్కా అని భావిస్తున్నట్టు సమాచారం. ఇక బీజేపీకి సైతం రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తప్పేలా లేదు.. దీంతో బీజేపీతో వెళ్లాలా వద్దా? వెళ్తే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. ఇక ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఒక దిశా నిర్దేశం లేని మార్గంలో పయనిస్తూ తనకుతానే దారితప్పిపోతున్నారు. ఇక జగన్ మాత్రం ఎవర్నీ నమ్ముకోకుండా అచ్చం ప్రజలతో మాత్రమే మా పొత్తు. మీ ఇంట్లో మేలు జరిగితే.. మీకు మంచి జరిగితే మీ బిడ్డను ఆశీర్వదించండి అనే కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు జగన్‌కు మరోమారు పట్టంగట్టే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెబుతోంది.