వలంటీర్లకు సీఎం జగన్ ఫుల్ సపోర్ట్.. నోరుజారిన నేతలందరికీ దిమ్మతిరిగేలా రిటర్న్ గిఫ్ట్..
పచ్చ పార్టీ నేతలు తెగ రెచ్చిపోతున్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఎల్లో మీడియాను కలుపుకుని టీడీపీ, జనసేన నేతలు ముప్పేట దాడి చేస్తున్నా తిరగబడింది లేదు. ఈ విషయమై వైసీపీ అభిమానులు సైతం ఒకింత ఆందోళనకు గురయ్యారు. అసలెందుకు జగన్ స్పందించరని తమలో తామే ప్రశ్నించుకున్నారు. కానీ సమయం వచ్చేసింది. జగన్ అందరికీ పేరుపేరునా ఇచ్చిపడేశారు. ఎంతలా అంటే ఇప్పట్లో ఆ నేతలెవరూ తేరుకోలేనంగా..
సంస్కారహీనంగా కామెంట్స్..
వాస్తవానికి సీఎం జగన్ గత కొంతకాలంగా విమర్శల్ని తిప్పికొడుతూనే ఉన్నారు. కానీ.. అది ఒక స్థాయి వరకే ఉండేది. కానీ తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో నిన్న జరిగిన సభలో ఆ విమర్శల పదును పెరిగింది. దానికి కారణం లేకపోలేదు. గత కొన్నిరోజులుగా వలంటీర్లపై పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత నీచపు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నాలుగేళ్లుగా నిస్వార్థంగా పేదల కోసం వలంటీర్లు పనిచేస్తున్నా.. సంస్కారహీనంగా పచ్చ నేతలు కామెంట్స్ చేయడం జగన్‌కి కోపం తెప్పించింది. మంచి చేస్తున్న వారిని తిట్టడం సంస్కారం అనిపించుకోదు అంటూ చురకలు అంటించారు. అంతేకాదు.. వలంటీర్లకి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పేరుపేరునా కౌంటర్లు..
బహిరంగ వేదికపై పేరుపేరునా ఇచ్చిపడేశారు. అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే కడుపు చేయాలనే మహానుభావుడు ఒకరు (నందమూరి బాలకృష్ణ ).. మీరు సినిమాల్లో చేశారు.. నేను కాలేజీ రోజుల్లోనే చేసేశానని ఒక షోలో చెప్పే మాజీ సీఎం ఒకరు (చంద్రబాబు).. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటూ అమ్మాయిలకి ద్రోహం చేసేవాడు ఒకరు (పవన్ కల్యాణ్).. అమ్మాయిలతో కలిసి మందుతాగి స్విమ్మింగ్ ఫూల్లో అసభ్యంగా పోజులు ఇచ్చే వాడు ఒకరు (నారా లోకేష్).. ఇలాంటి వాళ్లా మా వలంటీర్ల గురించి మాట్లాడేది? అంటూ జగన్ ఇచ్చిపడేశారు.
స్క్రిప్ట్ రామోజీరావు ఇస్తుంటే..
వలంటీర్లపై విమర్శలు పక్కా ప్లాన్‌తో చేస్తున్నారని ప్రజలకి సీఎం వైఎస్ జగన్ వివరించే ప్రయత్నం చేశారు. స్క్రిప్ట్ రామోజీరావు ఇస్తుంటే.. చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని.. ఆ ఇద్దరూ చెప్పినట్లు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడంటూ జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది.. వలంటీర్లు ఎవరో కాదు.. మన గ్రామంలోని పిల్లలే.. మన ఊరి బిడ్డలే. వాళ్ల గురించి మీకు తెలియదా? అంటూ జగన్ చెప్పగానే సభలో వాళ్లంతా తెలుసు అంటూ రిప్లై ఇచ్చారు.
తేలు కుట్టిన దొంగల్లా..
సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటల్లో అన్నీ నిజాలే ఉన్నాయని సామాన్య ప్రజలు సైతం అంగీకరిస్తున్నారు. సాక్ష్యాలు కావాలంటే యూట్యూబ్‌లో బోలెడు దొరుకుతాయని వైసీపీ నేతలు అంటున్నారు. కాబట్టి.. పచ్చ నేతల మాదిరిగా తాము మాట్లాడలేదని.. అలా చేయలేదు అని చెప్పే ధైర్యం చేయకపోవచ్చంటున్నారు. కాబట్టి.. ప్రస్తుతానికి తేలు కుట్టిన దొంగల్లా అందరూ ఉండిపోతారు. ఎల్లో మీడియా అసలు వెంకటగిరి సభలో సీఎం వైయస్ జగన్ రాజకీయ విమర్శలు చేయలేదు అనే తరహాలో వార్తలు వండి వడ్డిస్తోంది. కానీ ప్రస్తుతం.. ఇది సోషల్ మీడియా టైమ్. దీంతో ఎల్లో మీడియాలో చూసి వార్తలు తెలుసుకునే రోజులకి ఎప్పుడో కాలం చెల్లింపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు.