జగన్ సర్కార్ ఘనతకు ఇదే నిదర్శనం.. ఏపీలో పేదరికం తగ్గుతోందన్న నీతి అయోగ్..

ప్రభుత్వం ఘనతకు ఇదే నిదర్శనం.. ఏపీలో పేదరికం తగ్గుతోందన్న నీతి అయోగ్.. 

ఏపీలో ప్రభుత్వం పనితీరుకు ఇటీవలి కాలంలో అద్దం పట్టే అంశాలు ఎన్నో ఉదాహరణగా నిలుస్తున్నాయి. గతంలో మాదిరిగా పాలన అంటే అధికారం అని కాకుండా బాధ్యత అని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరూపిస్తున్నారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు అనేది గత ప్రభుత్వ భావన. కానీ ముఖ్యంగా ప్రజల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త నిర్వచనం చెప్పింది.

రాష్ట్రమంతా పేదలే ఉంటే రోడ్లు నిర్మించి ఏం ప్రయోజనం? ముందుగా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. ఇదే ఆశయంతో జగన్ చేసిన నాలుగేళ్ల పాలన ప్రస్తుతం సత్ఫలితాలను ఇస్తోంది. వారి జీవితాల నుంచి పేదరికాన్ని వేరు చేసి వారి ఇళ్లలో.. కళ్లలో దీపపు కాంతులు నింపారు.

నీతి అయోగ్ చెప్పిన వాస్తవమిది..

మన పనితనం గురించి గొప్పగా మనం చెప్పుకోవడం కాదు.. మన గురించి ఎదుటి వారు పొగడాలి. ఇక ప్రభుత్వ పనితనమైతే ఎల్లలు దాటాలి. ఇప్పుడు సీఎం జగన్ విషయంలో అదే జరుగుతోంది. నాలుగేళ్ళ క్రిందట ఆయనవేసిన సంక్షేమ మొలకలు కాస్త మొక్కలుగా.. ఆపై చెట్లుగా.. ప్రస్తుతం పేదల ఇళ్లలో పూలు పూయిస్తున్నాయి. 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా అది 2021 నాటికి 7.71 శాతానికి తగ్గిందని అదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది.

YS Jagan

ఆ రాతి గోడను పేదరికం దాటడం లేదు..

రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలపాలిట కావలి కోటలుగా నిలిచాయి. ఈ పథకాలను దాటుకుని పేదరికం ప్రజల ఇళ్లలోకి చొరబడడం అసాధ్యం అవుతోంది. ఉచిత విద్య, వైద్యం. రైతులకు భరోసా.. బాలలకు పౌస్టికాహారం.. గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం ఇలా ఒకటేమిటి? ఎన్నో పథకాలు ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి.

ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా సంక్షేమ పథకాలు అనే రాతి గోడను నిర్మించిన జగన్ ఆ గోడ దాటి పేదరికం ఆయా ఇళ్లలోకి రావడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఇల్లు దాటి కదల్లేని వృద్ధులకు సైతం ఇళ్లకే పెన్షన్లు… ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తూ పేదరికపు కాటు నుంచి ప్రజల్ని కాపాడే సైనికుడి బాధ్యత జగనన్న తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో పేదరికపు ఛాయలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాల్లో పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.

Google News