జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి.. పార్లమెంటు సాక్షిగా పరువు తీసుకున్న టీడీపీ..!

జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి.. పార్లమెంటు సాక్షిగా పరువు తీసుకున్న టీడీపీ..!

ఏదైనా దక్కితే మనకు దక్కాలి.. లేదంటే ఎవడికి దక్కకూడదు అనేది కొందరి భావన. ఏపీలో టీడీపీ తీరు కూడా అలాగే ఉంది. వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని ఓ దారిలోకి తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంతగానో కష్టపడుతున్నారు. కానీ ఆయన ప్రభుత్వానికి ఎలాంటి మంచి పేరు రాకుండా చూసుకోవడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న లోపం… పొరపాటు దొరికినా దాన్ని పట్టుకుని పెద్దది చేసి, మన సొంత పత్రికల్లో వేసి, జగన్‌తో పాటు రాష్ట్రం పరువు తీసిపారేయాలని తపించే తెలుగుదేశం వారి ఆశలు సాక్షాత్తూ రాజ్యసభ సాక్షిగా నిరాశగా మారాయి. 

ఆంధ్రాలో విదేశీ పెట్టుబడులు ఘోరంగా తగ్గిపోయినాయ్ అట కదా అంటూ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ సమాధానం ఇచ్చారు. దెబ్బకి టీడీపీ ఎంపీ అవాక్కయ్యారు. 

2019 అక్టోబర్ – 2020 మార్చ్ మధ్య : 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి 

2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు 

2021-22 : 224.96 మిలియన్ డాలర్లు 

2022-23 : 284.22 మిలియన్ డాలర్లు 

ఇలా ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానాన్ని సోమ్ ప్రకాష్ ఇచ్చారు. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిపోగా ఆ ప్రభావం వలన 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది. ఆ కొద్దికాలం దాటగానే ఆంధ్రాలో మళ్ళీ పెట్టుబడుల వరద మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావడం అంటే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దక్షతకు నిదర్శనం అని చెప్పకనే చెప్పారు.

సందర్భం వచ్చిన ప్రతిసారీ ఇదే తీరు …

ఈ ఒక్క విషయమే కాదు.. ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎప్పటికప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం నాయకుల ఆశల మీద సీఎం వైయస్ జగన్ తరచూ నీళ్లు పోస్తూనే ఉన్నారు. మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్నచూపు చూసిన తెలుగుదేశం అక్కడి సదస్సును, నిర్వహించే విధానాన్ని, దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి అవాక్కయ్యింది. టీడీపీ దావోస్ లాంటి సదస్సులకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తే.. ఏపీ ప్రభుత్వం విశాఖ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టింది.

అంబానీ, అదానీ, బిర్లా, భజంకా ఇలాంటి చాలా పారిశ్రామిక సంస్థలు వచ్చి ఆంధ్రప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల, పరిశ్రమల ఏర్పాటు పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడడం టీడీపీకి, దాని అనుకూల మీడియాకు కంటిమీద కునుకులేకుండా చేసాయి.

విశాఖలో ఏటిజి టైర్ల పరిశ్రమ దగ్గర్నుంచి ఎన్నో విదేశీ సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. దీంతో సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్నివిధాలా సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారు.

అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది. ఏడ్చేవాళ్ళు ఏడవనీ… నవ్వేవాళ్ళు నవ్వనీ … నా గమనం.. పయనం మాత్రం ప్రగతిపథం వైపే అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సాగుతూ ఉంది.