టీడీపీ అధినేత రాముడు.. నేను కాదు.. ఎవ్వరినీ విడిచిపెట్టను : నారా లోకేష్

టీడీపీ అధినేత రాముడు.. నేను కాదు.. ఎవ్వరినీ విడిచిపెట్టను : నారా లోకేష్

అమరావతిని కమ్మరావతి అని, టీడీపీ ప్రభుత్వం 37 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్‌ ఇచ్చారని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రచారాన్ని తాము సరిగ్గా తిప్పికొట్టలేకపోయామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రఓబనపల్లిలో కమ్మ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత చంద్రబాబు.. రాముడు లాంటి వారని.. తాను మాత్రం కాదన్నారు. ఎవరు ప్రజలను వేధించినా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేష్ అన్నారు.

Advertisement

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై కేసులు.. జైళ్లేనన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై 65 కేసులు, తనపై 20 కేసులు పెట్టారని నారా లోకేష్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని వేధింపులు కేవలం ఏపీలోనే ఉన్నాయని విమర్శించారు. సన్న బియ్యం సన్నాసి ఒకరు తన తల్లిని అవమానించారంటూ లోకేష్ మండిపడ్డారు.

నోటికొచ్చినట్లు తిడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. 16 నెలలు జైలుకెళ్లిన జగన్.. ఇప్పుడు అందరినీ పంపాలనుకుంటున్నారన్నారని విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే టీడీపీ ధ్యేయమని నారా లోకేశ్‌ అన్నారు.