హైకోర్టు రూల్స్.. గీల్స్ చంద్రబాబుకు జాన్తా నై..!!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోట్లు తినేసి.. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కెట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు.. ఆరోగ్య కారణాల రీత్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ‘మీ ఆరోగ్యపరిస్థితిని గమనించి, మీకు కంటి చికిత్స అవసరాన్ని గుర్తించి నెలరోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నాం. ఈ నెలరోజులు బుద్ధిగా ఉండాలి.. మైక్ కనిపించగానే ఇష్టానుసారం వాగొద్దు.. మీడియాతో మాట్లాడొద్దు.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దు.. నెల కాగానే మళ్ళీ జైలువద్ద లొంగిపోవాలి’ అని పలు షరతులు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే.. బాబు మాత్రం అబ్బే.. అవన్నీ మాకు పట్టవ్.. కోర్టు చెప్పినంత మాత్రాన పాటించాలా..? అని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జైలు నుంచి బయటకి వచ్చిన నిమిషాల్లోనే యథేఛ్చగా ఉల్లంఘించారు. బాబే ఇలా చేస్తే.. ఇక టీడీపీ శ్రేణులు సైలెంట్‌గా ఉంటాయా..? ఎక్కడికక్కడ విర్రవీగాయ్.. జైలు ముందు నానా రచ్చ చేసి.. ఆఖరికి పోలీసులతోనే గొడవ పెట్టుకున్న పరిస్థితి. ఎంతలా అంటే స్వయానా సీనియర్ నేత అచ్చన్నాయుడు పోలీసు అధికారులతో గొడవ పెట్టుకున్నారంటే అర్థం చేస్కోండి.. అంతేకాదు బాబు బయటికి రాకముందే తాము గేటు తీసుకొని లోపలికి వెళ్లాలని కూడా రచ్చ రచ్చ చేసేశారు.
అది నేనే.. ఇది నేనే..!
‘ అవును.. వ్యవస్ధను సృష్టించిందే నేను.. వ్యవస్థలను నడిపేదే నేను’ అని చంద్రబాబు అనుకుంటున్నారో ఏమో కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే యాభైరోజులుగా మైక్ దొరకక ఆవురావురుమంటున్న చంద్రబాబు వెంటనే స్వోత్కర్ష మొదలు పెట్టారు.. ‘నేను నిప్పును.. తప్పు చేయను.. చేయనివ్వను’ అంటూ తన ఘనతను చెప్పుకుంటూ పోగా కార్యకర్తలు సైతం ర్యాలీ చేశారు. ఈ సందర్బముగా చంద్రబాబు తానూ జైల్లో ఉన్నపుడు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ధన్యవాదాలు తెలిపారు. నెలరోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు విధించిన నిబంధనలు అయన ఒక్కరోజులోనే ఉల్లంఘించి తన తీరును వెల్లడించారు. తనను ఎవరేమి చేస్తారు అనే ధీమాతోనే చంద్రబాబు అలా చేసినట్లు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక అయన ఈ నెలరోజుల్లో ఇంకెన్ని విధాలుగా తన దూకుడును బయటపెట్టి కోర్టులను, వాటి తీర్పులను అవహేళన చేస్తారో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. చంద్రబాబు ఇవాళ చేసిన ఈ వ్యవహారంపై సీఐడీ అధికారులు మరోసారి కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారని తెలియవచ్చింది. ఇదే జరిగితే బహుశా మధ్యంతర బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. కోర్టు విధించిన షరతులను అతిక్రమిస్తే తప్పకుండా మళ్లీ అరెస్ట్ చేసే అధికారులు సీఐడీకి, ఏపీ పోలీసులకు ధర్మాసనం ఇచ్చిన సంగతి తెలిసిందే.