కేసీఆర్ వరాలతో బీభత్సంగా కనెక్టైన జనం..
తెలంగాణపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి రోజు రోజుకూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎందరికో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి నిరుపేదలకు ఇల్లు లేదన్న బెంగను తీర్చారు. రెంటు కట్టలేక పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించారు. వంద శాతం అక్షరాస్యత లక్ష్యంగా వచ్చే టర్మ్‌లో పని చేస్తామని తాజాగా ఆయన హామీ ఇచ్చారు.
ఇప్పటికే తెలంగాణలోని ప్రతి ఇల్లు కూడా ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల కారణంగా లబ్ది పొందుతోంది. ఇప్పుడు వాటికి తోడుగా.. ఈసారి అధికారంలో వస్తే.. రెండు పడకల ఇళ్లు, గృహలక్ష్మి పథకాలను కొనసాగిస్తామని కేసీఆర్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మాత్రమే కాదు.. అలాగే 1200-1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కొనుగోలు చేసే మధ్య తరగతి వర్గాలకు ఇంటి రుణాల్లో వడ్డీ చెల్లింపు సహా ఇతర ప్రయోజనం కల్పించే అంశంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
మొత్తానికి సీఎం కేసీఆర్ సహా గులాబీ నేతలంతా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పక్కాగా ఈసారి కూడా గులాబీ పార్టీదే విజయమని తెలంగాణలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొంత నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్నా కూడా కాస్తో కూస్తో సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప అధికారం మాత్రం గులాబీ పార్టీదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014తో పోలిస్తే.. తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ధి, సంక్షేమంలో ఊహించని మార్పును అయితే మనం కూడా గమనించవచ్చు.