తెలంగాణ జర్నలిస్టు ఫోరం సర్వే.. తెలంగాణ పక్కాగా బీఆర్ఎస్‌దే..

తెలంగాణ జర్నలిస్టు ఫోరం సర్వే.. తెలంగాణ పక్కాగా బీఆర్ఎస్‌దే..

సర్వేలు చాలా వెలువడ్డాయి. అన్నీ కూడా బీఆర్ఎస్‌దే విజయమని తేల్చాయి. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చింది. గులాబీ బాస్ పక్కాగా హ్యాట్రిక్ సీఎం అవుతారని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్‌) తేల్చింది. తాజాగా ఇది తెలంగాణలో ఏ పార్టీ విజయం సాధించబోతోంది? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అనే విషయాలపై తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. 

తాజాగా తెలంగాణలో సర్వే నిర్వహించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం క్షేత్రస్థాయిలో అంశాల వారీగా సర్వే నిర్వహించి తుది నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం తెలంగాణలో 40 శాతం మంది కేసీఆర్‌కే మద్దతు తెలియజేస్తున్నారు. తెలంగాణలో గతంతో పోలిస్తే బీఆర్ఎస్‌కు సీట్లు అయితే తగ్గుతున్నాయని సర్వే తేల్చింది.  64 నుంచి 68 సీట్లతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం పక్కా అని సర్వే వెల్లడించింది. 

ఇక కాంగ్రెస్ పార్టీ 34 నుంచి 38 సీట్లకే పరిమితం అవుతుందని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తేల్చింది. బీజేపీ అయితే మరీ దారుణం. కేవలం సింగిల్‌ డిజిట్‌లోపు సీట్లనే గెలుస్తుందని తెలిపింది. ఆ పార్టీకి కేవలం 5 నుంచి 6 సీట్లే వస్తాయని సర్వేలో వెల్లడించింది. ఎంఐఎం సీట్లలో మాత్రం తేడా ఉండదని.. ఎప్పటిలాగే 6 నుంచి 7 సీట్లు పక్కాగా కైవసం చేసుకుంటుందని తెలిపింది. బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కూడా ఈసారి సీట్లు గెలుచుకుంటుందట. ఆ పార్టీ 1 నుంచి 2 సీట్లు కైవసం చేసుకుంటుందని.. స్వతంత్రులు కూడా ఒకట్రెండు స్థానాల్లో విజయం సాధించవచ్చని సర్వే తేల్చింది.

Google News