వైట్ హౌస్‌కు రండమ్మా.. మన బడి పిల్లలకు అమెరికా అదిరిపోయే ఆహ్వానం

వైట్ హౌస్‌కు రండమ్మా.. మన బడి పిల్లలకు అమెరికా అదిరిపోయే ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మన బడి పిల్లలు బాగా ఎదుగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మన పిల్లల ప్రగతి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ఇప్పుడు మన బడి పిల్లలకు అమెరికా నుంచి ఆహ్వానం అందింది. నానో టెక్నాలజీ సదస్సుకు రమ్మని అమెరికా ఆహ్వానం పలికింది. మచ్చే ఏడాది మార్చి 5న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం పలికింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు, భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్‌తో మన విద్యార్థులు ఆ వేదికలో మాట్లాడే గొప్ప అవకాశం వారికి దక్కింది. ఎక్కడి చిన్నారులు ఎవరితో కలిసి అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు? అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఆప్టిక్స్, విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగం,మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి అంశాల మీద విద్యార్థులు అక్కడ ప్రసంగించనున్నారు. ఇప్పటికే పలు సదస్సులో సత్తా చాటిన మన విద్యార్థులకు ఇది మరో ఊహించని అవకాశం.

వైట్ హౌస్‌కు రండమ్మా.. మన బడి పిల్లలకు అమెరికా అదిరిపోయే ఆహ్వానం

ఏపీకే కాదు.. దేశానికే గర్వకారణం..

గత సెప్టెంబర్‌లో సైతం అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి మన విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడి పాలనా విధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాల మీద జరిగిన చర్చల్లో పాలు పంచుకున్నారు. అంతర్జాతీయ విద్యావేత్తలు, ఆర్థిక, సామజిక వేత్తలతో భేటీలు నిర్వహించడం ఏపీకే కాదు దేశానికే గర్వకారణం. ఏపీ నుంచి మొత్తంగా పది మంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సందర్శించారు.

వైట్ హౌస్‌కు రండమ్మా.. మన బడి పిల్లలకు అమెరికా అదిరిపోయే ఆహ్వానం

విద్యావ్యవస్థ బలోపేతంపై వివరణ..

ఊరు దాటి వేరొక జిల్లాకు వెళ్లాలంటేనే భయపడే చిన్నారులు ఖండాలు దాటారు. ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు. తాజాగా ఇప్పుడు మరో సదస్సుకు పిలుపు రావడం అంటే మన ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకు అద్భుతమైన గుర్తింపు వచ్చినట్లేనని ఏపీ ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తోంది..