రైతుబంధుపై దెబ్బ.. కేసీఆర్‌కే ప్లస్..!

రైతుబంధుపై దెబ్బ.. కేసీఆర్‌కే ప్లస్..!

రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించింది. 24 నుంచి నేటి వరకూ రైతుబంధు పంపిణీకి కొద్ది రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చింది. ఇవాళ రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంతలోనే రైతుబంధును ఈసీ నిరాకరించింది. ఫిర్యాదులు రావడంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు ‘పలానా సమయానికి, పలానా తేదీన రైతుబంధు డబ్బులు పడుతాయి’ వ్యాఖ్యానించి నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.

రైతుబంధుపై దెబ్బ.. కేసీఆర్‌కే ప్లస్..!

ఈ క్రమంలోనే హరీష్ రావుకు సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. నిజానికి రైతుబంధుకు ఈసీ అనుమతించినప్పటి నుంచి బ్యాంకులకు సెలవులే ఉండటంతో టీ సర్కార్ నిధులను విడుదల చేయలేకపోయింది. ఈసారి పోడు రైతులకు సైతం రైతుబంధు ఇస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. మొత్తంగా 70 లక్షల మందికి ఇస్తామని వెల్లడించింది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నేటితో ప్రచార ఘట్టం ముగుస్తుంది. కాబట్టి రేపటి నుంచి రైతుబంధు విడుదల చేయడానికి అవకాశం లేదు.

రైతుబంధుపై దెబ్బ.. కేసీఆర్‌కే ప్లస్..!

ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కారు రైతులందరి ఖాతాలో డబ్బును జమ చేసేందుకు సిద్ధమైంది. నేడు సడెన్‌గా ఈసీ రైతుబంధుకు అనుమతులు వెనక్కి తీసేసుకుంటున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఏది ఏమైనా కూడా పోడు రైతులతో సహా రైతులందరికీ కేసీఆర్ సర్కార్ రైతుబంధును ఇస్తామని చెప్పడం పట్ల అంతా చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ సర్కార్ వస్తే పక్కాగా తమకు లబ్ది చేకూరుతుందన్న ధీమాలో ఉన్నారు. ఈసీ అనుమతి నిరాకరించినా కూడా ప్రభుత్వం తిరిగి అధికారం ఏర్పాటు చేసిన వెంటనే తమ ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తుందని.. కాబట్టి కేసీఆర్ సర్కార్ వైపే రైతులంతా మొగ్గు చూపే అవకాశం ఉంది.

Google News