కేసీఆర్‌ను కొట్టిన మగాడే లేడు..!

కేసీఆర్‌ను కొట్టిన మగాడే లేడు..!

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటి వరకూ అత్యధిక విజయాలు సాధించి కేసీఆర్‌ రికార్డ్‌ క్రియేట్ చేశారు. ఎన్నికలు ఏవైనా సరే.. అత్యధిక సీట్లు బీఆర్ఎస్‌వే. అసెంబ్లీ ఎన్నికల్లోనే కేసీఆర్ ఇప్పటి వరకూ 8 సార్లు విజయం సాధించడం విశేషం. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తొలిసారిగా ఆ పార్టీ నుంచి సిద్ధిపేట ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడారు. తొలి ఎన్నికే ఆయనకు నిరాశను మిగిల్చింది. ఇక ఆ తరువాత మాత్రం ఆయన వెనుదిరిగి చూడలేదు. 1985 మొదలు.. వరుసగా 8 సార్లు విజయం సాధించారు.

1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించగా… 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి గెలుపొందారు. 2001 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. తొలిసారి తన సొంత పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా తమ పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్నారు కేసీఆర్. అప్పటి నుంచి మొదలు వరుసగా రెండు సార్లు అధికారం ఆయనదే.

ఇక ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం కోసం ఎన్నికల బరిలోకి దిగారు. ఈసారి కూడా పక్కాగా విజయం ఆయనదేనని సర్వేలు చెబుతున్నాయి. ఎంత పోటీ ఉన్నా.. ఏం జరిగినా కూడా ఈ సారి గులాబీ పార్టీయే విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నా కూడా కేసీఆర్‌ను ఢీకొనగలిగే స్థాయికి అయితే పుంజుకోలేదని టాక్. మొత్తానికి విజయాల్లో అయితే కేసీఆర్‌ను కొట్టే మగాడే లేడని పార్టీ నేతలు చెబుతున్నారు. సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు మాంచి జోష్ మీదున్నారు.

Google News