ఏపీలో అధికారం కావాలంటే ఆ రెండు జిల్లాలను ప్రసన్నం చేసుకోవాల్సిందే..
ఏ రాష్ట్రంలో అయినా సీఎం సీటును డిసైడ్ చేసే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఏపీ ఒకటి. ఈ రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రమే సీఎం సీటును డిసైడ్ చేస్తాయి. అవి కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో 33 వరకూ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఈ రెండు జిల్లాలను ప్రసన్నం చేసుకుంటే చాలు. ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీదే విజయం. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఈ రెండు జిల్లాలనూ తమ ఖాతాలో వేసేసుకుంది.
అత్యధిక సీట్లను కైవసం చేసుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే రెండు పార్టీల నుంచి నేతలు అటు ఇటుగానే ఉన్నారు. విజయవాడ నుంచి కేశినేని నాని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయన ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై లేకపోలేదు. ఆయన పార్టీ మారితే కొంతమేర టీడీపీకి నష్టమే. అలాగే వైసీపీ నుంచి కూడా కొందరు నేతలు అటు ఇటుగానే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఏపీలోని చాలా జిల్లాల్లో వైసీపీ హవానే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీలో ఉమ్మడి 13 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో వైసీపీదే హవా అని తెలుస్తోంది. ఇక మిగిలిన 6 జిల్లాలు టీడీపీకి ఫేవర్‌గా ఉన్నాయి. ఎన్నికల నాటికి అవి అటు ఇటు అయినా అవ్వొచ్చు. ఇక మొత్తంగా అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ బీభత్సంగానే ఉండే అవకాశం ఉంది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సగానికి పైగా స్థానాలను ఎవరు తమ ఖాతాలో వేసుకుంటారో వారిదే సీఎం సీటు. ఇక చూడాలి ఏ పార్టీ ఈ రెండు జిల్లాల్లో సత్తా చాటుతుందో..