కేశినేని మరో సంచలన పోస్ట్..

కేశినేని మరో సంచలన పోస్ట్..

ఎంపీ కేశినేని నాని అయితే టీడీపీ నుంచి నిష్క్రమించాలని డిసైడ్ అయ్యారు.తనకు సంబంధించిన పొలిటికల్ అప్‌డేట్స్ అన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తాను త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఆయన మరో సంచలన పోస్టు పెట్టారు. ఇవాళ తన కూతురు చేత రాజీనామా చేయిస్తున్నట్టు కేశినేని నాని తెలిపారు.

నేటి ఉదయం 10:30 గంటలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి… తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. ఆ వెంటనే శ్వేత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తారని కేశినేని నాని ప్రకటించారు. తనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వనని చంద్రబాబు తెలిపిన తర్వాత కేశినేని నాని తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ఆయన పోస్టులను బట్టి తెలుస్తోంది.

రాజీనామాలు చేస్తారు సరే.. మరి నెక్ట్స్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. తన ప్రతి ఒక్క అప్‌డేట్‌ను అయితే అనుచరులకు తెలియజేస్తున్నారు. అలాగే అనుచరులతో చర్చించిన మీదట ఏం చేయాలనేది డిసైడ్ అవుతానని కేశినేని నాని తెలిపారు. ఆయన వైసీపీలోకి వెళతారా? లేదంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో సంబంధం లేకుండా బరిలోకి దిగినా కూడా ఆయన నెగ్గుకురాగల దిట్ట. కేశినేని నానికి పార్టీకి అతీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏది ఏమైనా కేశినేని నాని రాజీనామా పార్టీకి పెద్ద దెబ్బే. 

Google News