‘రా కదలిరా’ సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి

'రా కదలిరా' సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి

అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో టీడీపీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహిసున్నారు. ఇక తాజాగా ఈ కదిలిరా సభ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగింది. దీనికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ప్రచార సభలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఈ సభకు కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం హాజరయ్యారు. ఒక అభిమాని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతోనే సభకు హాజరయ్యాడు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎదురవగానే ఓ నేత చెప్పాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైన్యం కొట్టి అక్కడి నుంచి తరిమేసింది. చంద్రబాబు సభలో ఎవరూ కూడా జై జూనియర్ ఎన్టీఆర్ అనడానికి కానీ అసలు ఆయన ప్రస్తావన తీసుకురావడానికి కూడా లేదు.

Advertisement
'రా కదలిరా' సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి

జై ఎన్టీఆర్ అన్న పాపానికి వారి మీద నారా లోకేష్ సైన్యం దాడి చేసింది. ఇది తెలుగుదేశంలో ఎన్టీఆర్ మనవడుకి ఇచ్చిన విలువ. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏదో టీడీపీపై అభిమానంతో సభకు హాజరైతే ఇలా కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్‌పై ఎంత ద్వేషముందో అర్థమవుతోందని అంతా అంటున్నారు.