ఏపీ నుంచి అలీ ఫిక్స్.. ఎక్కడి నుంచి పోటీ అంటే..

ఏపీ నుంచి అలీ ఫిక్స్.. ఎక్కడి నుంచి పోటీ అంటే..

తెలంగాణ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకుని వైసీపీ ఏపీలో పావులు కదుపుతోంది. సిట్టింగ్‌లను మార్చకపోవడం కూడా తెలంగాణలో బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టింది. ఇలాంటి పరిస్థితి ఏపీలోనూ రాకూడదని వైసీపీ అధినేత జగన్ సర్వేలు చేయించి మరీ గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉన్న దాదాపు 60 మంది సిట్టింగ్‌లకు ఉద్వాసన పలుకుతున్నారని టాక్. కొందరికి స్థాన చలనం కల్పిస్తున్నారు.

ఇక ఉద్వాసన పలుకుతున్న వారి స్థానంలోకి జగన్ కొత్తవారిని తీసుకురానున్నారు. వారిలో సినీ ఇండస్ట్రీ నుంచి కమెడియన్ అలీ కూడా ఉంటారని టాక్. అలీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని జగన్ యోచిస్తున్నారట. ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉండే కర్నూలు లేదంటే నంద్యాల నుంచి బరిలోకి దింపవచ్చని తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒక ప్రాంతమైతే అలీకి ఫిక్స్ అట. ఇప్పటికే అలీకి దీనికి సంబంధించి సమాచారం కూడా అందించారట.

గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. అయితే అలీ మాత్రం తన సొంత ఊరైన రాజమండ్రి స్థానం జగన్‌ను అడిగారట. లేదంటే గుంటూరు తూర్పు నుంచి పోటీ చేస్తానని జగన్‌కు అలీ తెలిపారట. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని తెలిపారట. కానీ అలీకి ఎలాంటి పదవీ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట.

Google News