రాజ్యసభ ఎన్నికల్లో జగన్ వ్యూహమిదే..
రాజ్యసభ ఎన్నికల విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు తిరిగి రిపీట్ అవకుండా పక్కాగా స్కెచ్ గీస్తున్నారు. టీడీపీ ఇప్పటికే రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. వై వి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులను రాజ్యసభ అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది.
గొల్ల బాబురావు వచ్చేసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. నిజానికి జగన్ తొలుత రాజ్యసభను చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు కేటాయించిందని టాక్. అయితే అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో సిట్టింగ్‌లలో చాలా మందిని మార్చేసి.. కొందరికి స్థానచలనం కల్పించారు. అయితే పక్కన పెట్టేసిన వారిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువ. దీంతో రాజ్యసభకు ఎస్సీ సామాజిక వర్గ నేతను వైసీపీ ఎంపిక చేసింది.
అయితే గతంలో గొల్ల బాబురావు జగన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన అసంతృప్తిని సైతం ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట వ్యక్తం చేశారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉండేవారు. ఇప్పుడు అనూహ్యంగా గొల్ల బాబూరావును జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లు కోల్పోయే అవకాశమే లేదని వైసీపీ భావిస్తోంది. అయితే టీడీపీ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన నేతనే ఎంపిక చేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.