‘భీమా’ ట్విటర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
మ్యాచో స్టార్ గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్‌కు ఈ సినిమా హిట్ అందించినట్టేనా? వంటి ప్రశ్నలకు సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్లో సమాధానమిస్తున్నారు.
యాక్షన్ ఎపిసోడ్స్‌కి తోడు కామెడీ సీక్వెన్స్ సమపాళ్లలో ఉందని ప్రేక్సకులు చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో పటు క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు. గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీశాడట. హీరోకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్‌లో ఆయన రోల్ సర్ప్రైజింగ్గా ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అయితే గోపీచంద్ అదరగొట్టాడట. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్ అనేది సినిమాకి హైలైట్ అని ప్రేక్షకులు అంటున్నారు.
ఈ చిత్రానికి క్లైమాక్స్ కూడా మరో మేజర్ హైలైట్ అని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘నీ కటౌట్‌కి పడాల్సిన సినిమా భీమా అని నా స్ట్రాంగ్ ఫీలింగ్… మాచో స్టార్ నుంచి బ్లాక్ బస్టర్ ఆశిస్తున్నా..’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ మధ్య కాలంలో గోపిచంద్ సినిమాలతో పోలిస్తే భీమా చాలా బాగుందని చెబుతున్నారు. ఇక సినిమా ఫుల్ రివ్యూ వస్తే కానీ ఎలా ఉందన్న విషయంలో పూర్తి క్లారిటీ రాదు. ఇప్పటి వరకూ చూసిన ప్రేక్షకులు మాత్రం.. గోపీచంద్‌కి ‘భీమా’ బిగ్ రిలీఫ్ అనే అంటున్నారు.