రామ్ చరణ్ గారూ.. ఏం వండుతున్నారండీ?

రామ్ చరణ్ గారూ.. ఏం వండుతున్నారండీ?

స్టార్ హీరోలు ఏం చేసినా తెగ వైరల్ అవుతూ ఉంటుంది. పురుషులు చాలా మంది వంటలో తల్లులకు, భార్యలకు సాయపడుతూ ఉంటారు. అవి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఎవరూ పట్టించుకోరు కానీ సెలబ్రిటీలు గరిటె పట్టుకుంటే మాత్రం కళ్లు ఇంతవి చేసుకుని చూస్తుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు కాస్త ఫ్రీ టైం దొరికినట్టుంది. వంటింట్లో తల్లికి సాయం చేస్తూ సందడి చేశాడు.

చెర్రీ తల్లితో కలిసి వంట చేస్తున్నప్పుడు ఉపాసన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ రామ్ చరణ్ తన తల్లికి వంటింట్లో సాయం చేస్తున్న వీడియోలు చాలానే వచ్చాయి. ఇక విమెన్స్ డే సందర్భంగా మరోసారి గరిటె పట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన చిత్రీకరించారు. ‘అత్తమ్మ గారండి మీ కిచెన్‌లో ఏం అవుతుంది?’ అని అత్త సురేఖను ప్రశ్నించారు.

ఆపై చెర్రీని ‘రామ్‌చ‌ర‌ణ్ గారు ఏం వండుతున్నారండి’ అని ఉపాసన ప్రశ్నించారు. వారు చేస్తున్న వంట గురించి వారితోనే ప్రేక్షకులకు ఉపాసన చెప్పించారు. చివ‌ర‌లో ప్రతిరోజూ ఉమెన్స్ డే అయితే బాగుంటుందని ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఇటీవల సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ అంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఉపాసన ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.