జబర్దస్త్ శాంతి ఎమోషనల్ వీడియో.. షాకవుతున్న నెటిజన్లు..

జబర్దస్త్ శాంతి ఎమోషనల్ వీడియో.. షాకవుతున్న నెటిజన్లు..

రీల్ లైఫ్‌లో ఉన్నట్టు రియల్ లైఫ్ ఉండదు. రీల్ లైఫ్‌లో నవ్వుతూ నవ్విస్తూ ఉండే కొందరు.. జీవితంలో మాత్రం రివర్స్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. జబర్దస్త్‌లో లేడి గెటప్స్ వేస్తూ ప్రేక్షకులకు శాంతి బాగా దగ్గరయ్యాడు. గుర్తింపు అయితే బీభత్సంగానే వచ్చింది కానీ అంతకు తగ్గట్టుగా డబ్బు అయితే సంపాదించుకోలేకపోయాడు.

బుల్లితెరపై ఎందరినో తన కామెడీతో ఆకట్టుకుంటున్న శాంతి.. రియల్ లైఫ్ మాత్రం కష్టాలమయమే. తల్లికి అనారోగ్య సమస్యలు. ఇప్పటికే ఆమె సర్జరీ కోసం ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టేశాడు. తల్లి మోకాలి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు లేక ఆమెకు తెలియకుండానే ఇంటికి అమ్మకానికి పెట్టినట్టు తెలిపాడు. ప్రస్తుతం తన తల్లి మోకాలి సర్జరీ పూర్తైందని ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని శాంతి స్వరూప్ వెల్లడించాడు.

Advertisement

శాంతి స్వరూప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తల్లి సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్న విషయం చెప్పి బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ ప్రకృతిలో అమ్మను మించిన ఆస్తి మరొకటి ఉండదని.. తన ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు శాంతికి ధైర్యం చెబుతున్నారు. బుల్లితెరపై అంత సంతోషంగా కనిపించే శాంతి రియల్ లైఫ్‌లో ఇన్ని కష్టాలు పడుతున్నాడా? అని షాక్ అవుతున్నారు.