అక్క మరణించిన కొన్ని గంటల్లోనే నటి మృతి.. మరణానికి ముందు ఏం పోస్ట్ పెట్టారంటే..

అక్క మరణించిన కొన్ని గంటల్లోనే నటి మృతి.. మరణానికి ముందు ఏం పోస్ట్ పెట్టారంటే..

అక్క మరణించిన 24 గంటల వ్యవధిలోనే సీరియల్ నటి సైతం మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డాలీ సోహి అనే నటి హిందీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 2000లో కెరీర్‌ను మొదలు పెట్టిన డాలీ సోహి ఇప్పటి వరకూ 20కి పైగా సీరియల్స్‌లో నటించారు. ‘కలాష్’ అనే డెబ్యూ సీరియల్ ద్వారా ఆమె బుల్లితెరకు పరిచయమయ్యారు.

కామెర్ల వ్యాధికి చికిత్స తీసుకుంటూ డాలీ సోహి సోదరి అమందీప్ సోహి చనిపోయింది. ఆమె చనిపోయిన 24 గంటలకే డాలీ సోహి సైతం మరణించింది. డాలీ సోహి మరణానికి కారణం గర్భాశయ క్యాన్సర్. గత కొంతకాలంగా డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తాజాగా ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచింది.

చనిపోవడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు డాలీ సోహి. ప్రార్థన అనేది ప్రపంచంలో ఒక గొప్ప వైర్‌లెస్ కనెక్షన్ అని అదొక మాయలా పని చేస్తుందని డాలీ సోహి తెలిపారు. తనకు మీ ప్రార్థనలు కావాలంటూ జనాలను ఆమె అర్థించారు. అంతలోనే డాలీ సోహి మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. డాలీ సోహి మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Google News