శరత్‌బాబు, జయలలిత ప్రేమ.. తర్వాత ఏం జరిగిందంటే..

శరత్‌బాబు, జయలలిత ప్రేమ.. తర్వాత ఏం జరిగిందంటే..

సీనియర్ నటి జయలలిత. అప్పట్లో చాలా సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. తొలుత హీరోయిన్‌గా అవకాశాలు కూడా వచ్చాయి. ఎందుకో ఆమె మాత్రం హీరోయిన్ కేరెక్టర్‌కు మాత్రమే స్థిరపడి పోకుండా వచ్చిన అవకాశాన్నల్లా అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె భర్త చనిపోయారు. అప్పటి నుంచి తన కుటుంబ సభ్యులను చూసుకుంటూ కాలం వెళ్లదీశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయలలిత ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పారు. తన తల్లిదండ్రులిద్దరూ మరణించాక ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చారట. ఆ తరువాత నటి రమాప్రభ, శరత్‌బాబు దంపతులకు బాగా క్లోజ్ అయ్యారట. అప్పటికీ రమాప్రభ, శరత్‌బాబు విడిపోలేదట. వారిద్దరినీ అక్కాబావ అని పిలుస్తూ చాలా హ్యాపీగా ఉండేవారట. శరత్‌బాబు మంచితనంతో ఆధ్యాత్మిక బోధనల కారణంగా ఆయనకు జయలలిత మరింత దగ్గరయ్యారట.

శరత్‌బాబుతో కలిసి తీర్థ యాత్రలు కూడా చేసినట్టు జయలలిత తెలిపారు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారిందట. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ సినీ పరిశ్రమలోని కొందరు పెళ్లి వద్దని చెప్పడంతో ఆగిపోయారట. శరత్ బాబును పెళ్లాడి ఆయనతో ఒక బిడ్డను కనాలని అనుకున్నారట జయలలిత కానీ పిల్లలు పుట్టాక తామిద్దరికీ ఏమైనా అయితే ఆస్తి కోసం పిల్లల్ని ఎవరైనా ఏదైనా చేస్తారని భయపడి పెళ్లి చేసుకోలేదట. ఇక శరత్ బాబు ఎవరికీ అన్యాయం చేసే మనిషి కాదని జయలలిత చెప్పారు. ఇప్పటికీ ఆయన పేరు తన ఫోన్‌లో తత్త్వమసి అని ఉంటుందని చెప్పుకొచ్చారు.