ప్రభాస్ మూవీలో బాలీవుడ్ స్టార్.. బిజీగా ఉన్నా కూడా..

ప్రభాస్ మూవీలో బాలీవుడ్ స్టార్.. బిజీగా ఉన్నా కూడా..

స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా అద్భుత విజయాలను అందుకుంటున్నాడు. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయి సక్సెస్‌ను ఇవ్వకపోయినా కూడా స్టార్ డమ్ మాత్రం చెక్కుచెదరడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందనున్న కల్కి సినిమాలో నటించనున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అక్షయ్ అయితే బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. చేతిలో చాలా సినిమాలున్నాయి. అయినా సరే.. సందీప్ రెడ్డి దర్శకత్వం అనగానే ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేశారట. ఇప్పటికే సందీప్ రెడ్డి బాలీవుడ్‌లో తీసిన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సినిమాల్లో నటించిన హీరోలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement
ప్రభాస్ మూవీలో బాలీవుడ్ స్టార్.. బిజీగా ఉన్నా కూడా..

ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి అడగ్గానే సినిమాలో చేసేందుకు స్టార్ హీరోలు వెనుకాడటం లేదట. అక్షయ్ పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రభాస్ అయితే ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. గత ఏడాది రెండు సినిమాలను విడుదల చేసిన ప్రభాస్ ఈ ఏడాది రాజాసాబ్‌తో పాటు కల్కి సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.