ఆ సినిమాకు ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు..

ఆ సినిమాకు ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు..

గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. గతంలో అయితే ఆస్కార్ మనకు రాదులే అని ఎవరూ పట్టించుకునే వారు కాదు.. ఇప్పుడు సీన్ మారింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ రావడంతో అందరి కళ్లూ ఆస్కార్ అవార్డులపైనే ఉన్నాయి. ప్రస్తుతం 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈసారి ఏ సినిమాలను ఆస్కార్ వరించింది? ఏ సాంగ్‌కు ఆస్కార్ దక్కింది?

అయితే ఈసారి భారతీయ సినిమాలకు గానీ.. భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలు దక్కలేదు. అయితే వసూళ్ల సునామీ సృష్టించిన హాలీవుడ్ మూవీ ‘ఓపెన్ హైమర్’ మాత్రం అవార్డుల పంట పండించింది. సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. ఇక ఓపెన్ హైమర్ మూవీ తర్వాత ఎక్కువగా ‘పూర్ థింగ్స్’ అనే సినిమా అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ‘బార్బీ’ సినిమాలోని ‘వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’ సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. బిల్లీ ఏలిష్ పాడిన పాట అద్భుతమైన మెలోడి సాంగ్ కావడం విశేషం.

Advertisement
oppenheimer oscar winner

ఆస్కార్ విజేతలు వీరే..

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
ఉత్తమ ఒరిజనల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ మూవీ)
ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ చిత్రం: ఓపెన్ హైమర్