హీరోయిన్ని పెళ్లి చేసుకోనున్న కిరణ్ అబ్బవరం

హీరోయిన్ని పెళ్లి చేసుకోనున్న కిరణ్ అబ్బవరం

శ్రీకాంత్ – ఊహ, నాగార్జున – అమల ఇలా ఎందరో హీరో, హీరోయిన్లు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ పెళ్లి చేసుకున్నారు. తాజాగా యువ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్నాడు.

“రాజావారు రాణిగారు” సినిమాతో కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. అదే సినిమాలో నటించిన రహస్య గోరక్ తో షూటింగ్ టైంలోనే ప్రేమలో పడ్డాడు. ఆ సినిమా తర్వాత ఇద్దరూ లివ్ – ఇన్ రిలేషన్షిప్ మొదలుపెట్టారు.

కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి రిలేషన్ షిప్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచానికి తెలియ చేస్తున్నారు. ఈ వారమే వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఇరువైపులా పెద్దల అంగీకారంతో పెళ్ళికి సిద్ధమైంది ఈ లవ్లీ జంట.

హీరోయిన్ని పెళ్లి చేసుకోనున్న కిరణ్ అబ్బవరం

కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుందని కిరణ్ అబ్బవరం టీమ్ తెలిపింది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ వెల్లడించనుంది.

కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం “దిల్ రూబా” సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు.