గేమ్‌చేంజర్‌లో శ్రీకాంత్.. ఏ పాత్రలో నటిస్తున్నారంటే..

గేమ్‌చేంజర్‌లో శ్రీకాంత్.. ఏ పాత్రలో నటిస్తున్నారంటే..

ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన దర్శకుడు శంకర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమా చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. గతంలో అయితే ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అయితే ఇటీవలి కాలంలో అయితే ఆశించిన రేంజ్ సక్సెస్‌ను అయితే అందుకోలేకపోతాయి. దీనికి కారణం యన స్టోరీ కంటే గ్రాఫిక్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారనే టాక్ అయితే ఉంది.

అలాగే స్టోరీ సెలక్షన్ కూడా శంకర్‌కు ఇబ్బందికరంగానే ఉంది. ఇక గేమ్ చేంజర్‌పై అంచనాలైతే ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్ కూడా రావడం లేదు. ఇక తాజాగా ఓ అప్‌డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారట. గోవిందుడు అందరివాడేలో చిత్రంలో చెర్రీకి బాబాయిగా నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఏ పాత్ర చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

గేమ్‌చేంజర్‌లో శ్రీకాంత్.. ఏ పాత్రలో నటిస్తున్నారంటే..

ఇప్పటి వరకూ అందుతున్న వార్తలను బట్టి అయితే గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు శ్రీకాంత్ కుడి భుజంలా ఉండబోతున్నారట. రామ్ చరణ్ చెప్పిందల్లా చేస్తూ పోతుంటారట. శ్రీకాంత్ నటిస్తున్నారనగానే ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మెగా ఫ్యామిలీలో శ్రీకాంత్ నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. శంకర్‌దాదా ఎంబీబీఎస్, శంకర్‌దాదా జిందాబాద్ వంటి సినిమాలు ఎంత మంచి సక్సెస్ సాధించాయో తెలిసిందే. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా మంచి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

Google News