ఆస్కార్ వేదికపైకి నగ్నంగా.. అసలు నిజమేంటంటే..

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా.. అసలు నిజమేంటంటే..

లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అతిరథ మహారథులు వేంచేస్తుంటారు. ఇక వారు వేసుకొచ్చే దుస్తులు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. ఎందుకంటే ఆస్కార్ వేడుకకు హాజరయ్యే వారంతా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని మరీ కొన్ని లక్షల విలువైన దుస్తుల్లో దర్శనమిస్తుంటారు. కొందరు దేశాన్ని హైలైట్ చేసేలా కూడా దుస్తులు ధరిస్తుంటారు.

అలాంటి ఆస్కార్ వేదికపైకి డబ్ల్యుడబ్ల్యుఈ రెజ్లర్, నటుడు జాన్ సీనా నగ్నంగా దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అంతా షాక్ అయ్యారు. స్థానిక మీడియా నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా అంతా ఈ విషయాన్ని హైలైట్ చేసింది. సోషల్ మీడియా అంతా జాన్ సీనా పేరు మారుమోగింది. ఇంతకీ అతడు నగ్నంగా ఎందుకు వచ్చాడు? నిజంగానే నగ్నంగా ఉన్నాడా? అనేది హాట్ టాపిక్ అయ్యింది.

ఆ తరువాత దీనిపై అకాడమీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా అకాడమీకి తెలిసే జరిగిందట. కేవలం ప్రచారం కోసమే.. జాన్ సీనా ఆస్కార్ వేదికపైకి వెళ్లడానికి ముందు ఇలా నగ్నంగా ఫోటోలు తీయించుకుని బయటకు విడుదల చేశారట. దీనికి అకాడమీ సపోర్ట్ కూడా ఉందట. ఇక వేదిక మీదకి వచ్చే సమయంలో జాన్ సీనా నగ్నంగా లేరట. ఒక బ్లాంకెట్ తరహా వస్త్రాన్ని చుట్టుకుని ఆయన వేదికపైకి వచ్చారట. దీనికి సంబంధించిన ఫోటోలను అకాడమీ నిర్వాహకులు విడుదల చేశారు. ఏది ఏమైనా ప్రచారం కోసం ఇలా చేస్తారా? అని జనం షాక్ అవుతున్నారు.