Samantha: సూట్‌లో మోడ్రన్ దేవకన్యలా సమంత.. చూపు తిప్పుకోవ్వడంలే..

సూట్‌లో మోడ్రన్ దేవకన్యలా సమంత.. చూపు తిప్పుకోవ్వడంలే..

స్టార్ హీరోయన్లకు సైతం ఫోటో షూట్ చేసి నెటిజన్ల అటెన్షన్‌ని గ్రాబ్ చేయక తప్పని పరిస్థితి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోయిన్ల వరకూ చేస్తున్నది ఇదే. ఎవరి సోషల్ మీడియా ఫాలోయర్స్ ఎక్కువగా ఉంటే వారికి అంత స్టార్ డమ్ అంటగట్టేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత సైతం ఇదే దారిలో నడుస్తోంది. ఇటీవలి కాలంలో సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తోంది. మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్ ఇప్పుడిప్పుడే తిరిగి దగ్గరవుతోంది. తాజాగా తనకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాగా స్లిమ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. చాలా అందంగా.. సూటులో నాటీ లుక్స్‌తో ముద్దుగుమ్మ కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు.

Advertisement
సూట్‌లో మోడ్రన్ దేవకన్యలా సమంత.. చూపు తిప్పుకోవ్వడంలే..

తెల్లటి ప్యాంటు సూట్‌లో గోల్డెన్ మెరుపులు.. ముత్యాల ఇయర్ రింగ్స్ పెట్టుకుని మోడ్రన్ దేవకన్యలా మెరిసిపోతోంది. పిచ్చి ప్రేమ అని ఈ బంచ్‌కి క్యాప్షన్ కూడా సామ్ ఇచ్చేసింది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా సామ్ తిరిగి ఓటీటీలో కనిపించనుంది. ఈ సిటాడెల్‌లో సామ్ సహనటుడు వరుణ్ ధావన్.. సామ్ ఫోటోలపై స్పందిస్తూ ఫైర్ ఎమోజీని షేర్ చేశాడు. జూలై 2023లో సిటాడెల్ ఇండియా షూటింగ్‌ను ముగించిన తర్వాత సమంత తన నటనకు బ్రేక్ ఇచ్చింది.