‘గామి’ ట్విటర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

'గామి' ట్విటర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

విశ్వక్సేన్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గామి’. విశ్వక్సేన్ నటించిన చిత్రాలన్నింటినీ దాదాపు అతనే ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేసేసి హైలైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాకు అతని ప్రమేయం లేకుండానే బీభత్సమైన హైప్ వచ్చింది. ఈ సినిమాలో విశ్వక్సేన్ అఘోర పాత్రలో నటించడం మరో విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ఇప్పటికే పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు.

ఈ సినిమాను కాస్త ఓపికతో చూడాలని.. అలా చూస్తే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ఓ నెటిజన్ చెబతున్నాడు. ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్రాణమట. సెకండాఫ్ యావరేజ్ అని అంటున్నారు. స్టోరీ లైన్.. సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా కూడా లాస్ట్ 30 నిమిషాలు సినిమాను నిలబెడుతుందట. ఇక విజువల్స్.. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ఒకదాన్ని మించి ఒకటున్నాయట. హీరో, హీరోయిన్లు ఇద్దరి నటన అద్భుతమని అంటున్నారు.

స్ర్కీన్‌ప్లే ఒక్కటి ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో ది బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇదేనని చెబుతున్నారు. మూడు కథలను మిక్స్ చేసి చూపించారని ఓ నెటిజన్ అంటున్నారు. సెకండాఫ్‌లో ట్విస్ట్‌లు బాగున్నాయట. వీఎఫ్ఎక్స్ అయితే అద్బుతమంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఇచ్చారని చెబుతున్నారు. మొత్తానికి సినిమాకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పటి వరకైతే హిట్ టాకే నడుస్తోంది.