ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోల కుమారులు..

ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోల కుమారులు..

ఇద్దరు ప్రముఖ హీరోలు కలిస్తే సినిమా ఎంత ఆసక్తికరంగా మారుతుందో.. వారి తనయులు ఇద్దరూ కలిసి ఒకే సినిమా కోసం వర్క్ చేసినా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా కోలీవుడ్‌‌లో దీనికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. విక్రమ్‌ వారసుడు ధ్రువ్‌ విక్రమ్‌ గురించి తెలిసిందే. ఇప్పటికే ధృవ్ హీరోగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ద్వారా కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  

ఆదిత్య వర్మ పేరుతో రూపొందిన ఈ చిత్రం ధృవ్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి ధ్రువ్‌ విక్రమ్‌ నటించిన మహాన్‌ చిత్రం మంచి టాకే తెచ్చుకుంది. కానీ ఆ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ క్రమంలోనే తనకు నేమ్, ఫేమ్ తెచ్చి పెట్టే సినిమా కోసం ధృవ్ ఎదురు చూస్తున్నాడు. మరోవైపుస్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తు.. ఆయన వారసుడు జాసన్‌ సంజయ్‌ కూడా సినీ రంగప్రవేశం చేస్తున్నాడు.

లండన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదివి వచ్చిన జాసన్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతను దర్శకత్వంపైనే ఫోక్ పెట్టాడు. అలా కథను రెడీ చేసుకున్న జాసన్‌ సంజయ్‌కు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ అవకాశం కల్పించింది. అయితే ఈ సినిమాలో హీరోగా ధృవ్‌ను అనుకుంటున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే వీరిద్దరూ ఒకే సినిమా కోసం పని చేయనున్నారు.