‘గామి’పై సెన్సార్ బోర్డ్ ప్రశంసలు..

గామి’పై సెన్సార్ బోర్డ్ ప్రశంసలు..

యంగ్ హీరో విశ్వక్‌సేన్, విద్యాధర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘గామి’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా క్రేజీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఇట ట్రైలర్ రిలీజ్‌తో సినిమాకు కావల్సినంత  హైప్ వచ్చింది. అందునా చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహించింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఇటీవల పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది.  సినిమాలో కొన్ని సన్నివేశాలను అద్భుతంగా తీశారట. ఈ సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయట. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది. నిజానికి ట్రైలర్ చూస్తే ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వస్తుందని ఎవరూ అనుకోరు.

గామి’పై సెన్సార్ బోర్డ్ ప్రశంసలు..

అయితే కొన్ని సన్నివేశాలు మరింత అద్భుతంగా ఉన్నాయట. ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండాఫ్‌పై అంచనాలు పెరగడం ఖాయమట. ఇక విశ్వక్‌సేన్ అఘోరా పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగింది. మానవ స్పర్శ తగిలితే తట్టుకోలేడట. ఈ సమస్య నుంచి బయట పడటం కోసం హిమాలయాలకు పయనమవడం.. హీరోయిన్ చాందిని చౌదరి కూడా అతనితో వెళ్లడం.. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే సినిమా కథ. మొత్తానికి సెన్సార్ బోర్డ్‌కైతే సినిమా బాగా నచ్చిందట. 

Google News